»Mla Bhavya Bishnoi And Ias Officer Pari Wedding Invitation To People Of 55 Villages
Viral news: ఎమ్మెల్యే, ఐఏఎస్ అధికారిణికి పెళ్లి..55 గ్రామాల ప్రజలకు ఆహ్వానం
ఎక్కడైనా పెళ్లి వేడుకకు 50కిపైగా గ్రామాల ప్రజలను పిలవడం చుశారా? లేదా అయితే ఈ వార్త మీరు చదవాల్సిందే. ఎందుకంటే డిసెంబర్ 22న జరగనున్న ఓ పెళ్లి వేడుకకు 55 గ్రామాల ప్రజలను ఆహ్వానించారు. అయితే ఎవరి పెళ్లి, ఎందుకు అంతమందని పిలిచారనేది ఇప్పుడు చుద్దాం.
MLA bhavya bishnoi and IAS officer pari wedding Invitation to people of 55 villages
హర్యానా మాజీ ముఖ్యమంత్రి చౌదరి భజన్‌లాల్ మనవడు, మాజీ ఎంపీ కుల్దీప్ బిష్ణోయ్ కుమారుడు ఎమ్మెల్యే భవ్య బిష్ణోయ్(bhavya bishnoi) మరికొన్ని రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కనున్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో డిసెంబర్ 22న ఐఏఎస్ పరి బిష్ణోయ్(Pari Bishnoi)ని భవ్య వివాహం చేసుకోనున్నారు. ఈ వేడుకకు దాదాపు 3 లక్షల మందికి పైగా హాజరయ్యే అవకాశం ఉంది. అంతేకాదు ఈ ఏడాది అత్యంత గ్రాండ్ వెడ్డింగ్‌లలో ఇది కూడా ఒకటి కానుంది. ఈ రాయల్ వెడ్డింగ్ తర్వాత ఢిల్లీ, హర్యానాలోని అడంపూర్, రాజస్థాన్‌లలో రిసెప్షన్లు కూడా జరగనున్నాయి. ఇందులో పలువురు సీనియర్ నేతలు పాల్గొనున్నారు.
ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ కుల్దీప్ బిష్ణోయ్ భవ్య విష్ణోయ్, పరిల వివాహ వేడుకకు హిసార్‌లోని అదంపూర్(adampur)లోని 55 గ్రామాల ప్రజలను ఆహ్వానించారు. తన తండ్రి అడుగుజాడలను అనుసరిస్తూ కుల్దీప్ బిష్ణోయ్ తన కుమారుడు భవ్య వివాహానికి సంబంధించిన ఆహ్వానాలను పంపిణీ చేస్తున్నారని చెబుతున్నారు. అదంపూర్ ఎమ్మెల్యే అయిన భవ్య విష్ణోయ్, ఐఏఎస్ పరి విష్ణోయ్ ప్రేమ వివాహం చేసుకుంటున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో వీరు నిశ్చితార్థం చేసుకున్నారు.
ఇక వీరి పెళ్లి డిసెంబర్ 22న రాజస్థాన్‌లోని ఉదయపూర్(udaipur)లో జరగనుంది. ఆ తరువాత, డిసెంబర్ 24 న రాజస్థాన్‌లోని పుష్కర్‌లో మొదటి రిసెప్షన్ జరుగుతుంది. ఇందులో దాదాపు 30-40 వేల మంది హాజరవుతారని తెలుస్తోంది. ఆ తర్వాత రెండో రిసెప్షన్ డిసెంబర్ 26న హర్యానాలోని అదంపూర్‌లో జరగనుంది. విష్ణోయ్ కుటుంబానికి ఆదంపూర్ బలమైన కోట అని మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం భవ్య ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఈ కార్యక్రమానికి 1 లక్ష మందికి పైగా అతిథులు హాజరయ్యే అవకాశం ఉంది. దీని తరువాత, మూడవ, చివరి రిసెప్షన్ డిసెంబర్ 27న ఢిల్లీలో జరగనుంది. ఈ వేడుకకు రాజకీయ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు ఇందులో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి 30 నుంచి 35 వేల మంది హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏది ఏమైనా వీరి పెళ్లి వేడుక ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఆదంపూర్ ఎమ్మెల్యే భవ్య విష్ణోయ్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ అభ్యసించాడు. దీంతోపాటు అతను అనేక కోర్సులు కూడా పూర్తి చేశారు. పరి విష్ణోయ్ ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని ఇంద్రప్రస్థ మహిళా కళాశాల నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆ తర్వాత అజ్మీర్‌లోని MDS విశ్వవిద్యాలయం నుంచి పొలిటికల్ సైన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీని పొందారు. పరి తన మూడవ ప్రయత్నంలో UPSC పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. దీనిలో ఆమె ఆల్ ఇండియాలో 30వ స్థానంలో నిలిచారు.