»Not Take A Oath Due To Akbaruddin Is Protem Speaker
Raja Singh: ప్రోటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్.. ప్రమాణం చేయ
తెలంగాణ అసెంబ్లీ ప్రోటెం స్పీకర్‌గా మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీని నియమించబోతున్నారు. అక్బర్ ప్రోటెం స్పీకర్ అయితే తాను ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అంటున్నారు.
Not Take A Oath Due To Akbaruddin Is Protem Speaker
Revanth Reddy: తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. రేవంత్ రెడ్డి (Revanth Reddy) ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి పదవీ బాధ్యతలు కూడా చేపట్టారు. 12 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇక మిగిలింది గెలిచిన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయడమే.. అందుకు ప్రోటెం స్పీకర్‌గా మజ్లిస్ నేత అక్బరుద్దీన్ వ్యవహరిస్తారు.
సభలో సీనియర్ ఎమ్మెల్యే ప్రోటెం స్పీకర్‌గా ఉంటారు. అత్యధిక సార్లు.. అంటే ఎనిమిది సార్లు.. ఆపై గెలిచింది కేసీఆర్.. సో ఆయన వ్యవహరించాల్సి ఉంది. నిన్న అర్ధరాత్రి బాత్ రూమ్‌లో జారిపడటంతో.. ఆస్పత్రిలో ఉన్నారు. సో.. ఆయన సభకు వచ్చే పరిస్థితి లేదు. సభలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్లు ఉన్నారు.. వారిలో ఉత్తమ్, భట్టి మంత్రులుగా ప్రమాణం చేశారు. సో.. ప్రోటెం స్పీకర్‌గా చేయడానికి వీలులేదు.
మజ్లిస్ పార్టీకి చెందిన అక్బరుద్దీన్‌ను ఎంపిక చేశారు. ఇతను 6 సార్లు సభకు ఎన్నికయ్యారు. శనివారం ఉదయం 8.30 గంటలకు రాజ్ భవన్లో అక్బరుద్దీన్ ఓవైసీ ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేస్తారు. తర్వాత ఉదయం 10.30 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయి. 4 రోజులపాటు సెషన్ జరగనుంది. కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణం చేయిస్తారు. స్పీకర్ ఎన్నుకునేంత వరకు ప్రొటెం స్పీకర్ సభను నిర్వహిస్తారు. స్పీకర్ పోస్ట్‌కు గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్ వేస్తారు. ఈ సారి ఆయనకు స్పీకర్ పోస్ట్‌ను కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది.
అక్బరుద్దీన్ ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించగా.. తాను ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ (Raja Singh) అంటున్నారు. రాజా సింగ్ బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన హిందూత్వ వాది.. అక్బర్ మజ్లిస్ నేత.. వీరిద్దరికీ పడదు. అందుకే అక్బర్ ప్రోటెం స్పీకర్‌గా ఉండగా.. ప్రమాణ స్వీకారం చేయనని అంటున్నారు.