»Tomato Missing Space Station After 8 Months Recovery
Tomato: అంతరిక్షంలో మిస్సైన టమాటా..8 నెలల తర్వాత మళ్లీ
టమాటా ఉన్న ఫలంగా కనిపించకుండా పోయింది. అయితే ఏంటి? టమాటా మిస్సైనా కూడా న్యూస్ అవుతుందా అంటే అవును. అది దొరకకుండా పోయింది భూమిపై కాదు అంతరిక్షంలో..అది కూడా 8 నెలల కనిపించకుండా పోయింది. తాజాగా దొరకడం పట్ల శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
tomato missing space station after 8 months recovery
సాధారణంగా మన ఇంట్లో టామాటా(tomato) లేదా ఇతర కూరగాయాలు కనిపించకుండా పోయినా కూడా పర్వాలేదు. ఎలుకనో లేదా ఎక్కడో ఓ చోట ఉందని అనుకుంటాం. కానీ అచ్చం ఇలాంటి సంఘటనే అంతరిక్షంలో జరిగితే ఎలా ఉంటుంది. అవును జరిగింది కానీ. మిస్సైన టమాటా కాస్తా 8 నెలల తర్వాత దొరికింది. అప్పుడు టమాటా మిస్సైన క్రమంలో అది తీసుకెళ్లిన వ్యక్తిపై అనేక రకాల ఆరోపణలు కూడా చేశారు. అక్కడి అంతరిక్ష కేంద్రంలో ఉన్న ఫ్రాంక్ రూబియో ఆ టమోటా తిన్నాడని కామెంట్లు చేశారు.
మరోవైపు కనిపించకుండా పోయిన టమాటా కుళ్లిపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు కూడా. ఈ నేపథ్యంలో 8 నెలల తర్వాత ఆ టమాటా మళ్లీ దొరకడం విశేషం. అంతరిక్షంలో మొక్కలు, పళ్లు పెంచే వెజ్ 05 అనే పరిశోధనలో భాగంగా రాబిన్ డ్వార్ఫ్ టమాటా రకానికి చెందిన వాటిని పండించారు. వాటిలో ఒక పండును పరిశోధన కోసం వ్యోమగామి ఫ్రాంక్ రుబియోకు పంపించారు. దానిని జిప్ లాక్‌లో పెట్టారు.
అయితే దానికి ఈ ఏడాది మార్చి 29న తీసే క్రమంలో చేయి జారీ గాలిలోనే తేలిపోతూ దూరంగా వెళ్లింది. ఆ తర్వాత 2.5 సెంటీ మీటర్లు ఉన్న ఆ టమాటా కోసం ఎంత వెతికినా కూడా లభించలేదు. దీంతో సెప్టెంబర్ 13న టమాటా కనిపించకుండా పోయినట్లు అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు అది దొరకకపోవడం వల్ల ఫ్రాంక్ రుబియో దానిని తినేశాడనే అపవాదు ఉండేదని..అది ఇప్పుడు తొలగిపోయిందని ప్రకటించారు. మరోవైపు అది దొరకడం పట్ల ఫ్రాంక్ రుబియో సంతోషం వ్యక్తం చేశారు. అది మిస్సైన క్రమంలో చాలా సమయం దానికోసం వెతికానని వెల్లడించారు. దాదాపు 18 నుంచి 20 గంటలు వెతికినా కూడా దొరకలేదని స్పష్టం చేశారు. ISS 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం (డిసెంబర్ 6న) ఈ మేరకు ప్రకటించారు.