Mizoram Election Result 2023: మిజోరంలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు నిన్న వెలువడగా.. మిజోరం ఫలితాలు మాత్రం ఈరోజు వెలువడ్డాయి. 40 మంది ఎమ్మెల్యేలు ఉన్న మిజోరం అసెంబ్లీ సీట్లకు జెడ్పీఎం 26, ఎంఎన్ఎఫ్ 11, బీజేపీ 2, కాంగ్రెస్ 1 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 20 సీట్లును జెడ్పీఎం దాటింది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలను వెనుకకు నెట్టి జెడ్పీఎం ముందుకు దూసుకెళ్లింది. మిజోరంలో మరోసారి కూడా ప్రాంతీయ పార్టీలదే హవా నడుస్తోంది. మిజోరం ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు అయ్యాయి. ఎందుకంటే కాంగ్రెస్ ఐదు సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసినా.. ఒక్క సీటులో మాత్రమే ఆ పార్టీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు.