»Supreme Court Central Extend Delhi Chief Secretary Naresh Kumar Tenure Six Months
Supreme Court: సుప్రీంకోర్టులో ఢిల్లీ ప్రభుత్వానికి షాక్! ప్రధాన కార్యదర్శి సర్వీసు పొడిగింపునకు ఆమోదం
ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేష్ కుమార్ పదవీకాలం పొడిగింపునకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఢిల్లీ ప్రధాన కార్యదర్శిని నియమించే హక్కు, అధికారం కేంద్రానిదేనని సుప్రీంకోర్టు పేర్కొంది.
Supreme Court: ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేష్ కుమార్ పదవీకాలం పొడిగింపునకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఢిల్లీ ప్రధాన కార్యదర్శిని నియమించే హక్కు, అధికారం కేంద్రానిదేనని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేష్‌కుమార్‌కు మరో 6 నెలలు పొడిగింపు ఇవ్వవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇది ఢిల్లీ ప్రభుత్వానికి గట్టి దెబ్బగా భావిస్తున్నారు. ప్రధాన కార్యదర్శి నరేష్ కుమార్ నవంబర్ 30న పదవీ విరమణ చేయబోతున్నారు. అంతకుముందు నవంబర్ 24 న, నవంబర్ 28 ఉదయం 10.30 గంటలలోపు ఢిల్లీ కొత్త ప్రధాన కార్యదర్శి పదవికి ఐదుగురు సీనియర్ బ్యూరోక్రాట్ల పేర్లను సూచించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరింది.
ట్రాన్స్ఫర్-పోస్టింగ్ కేంద్ర ప్రభుత్వ హక్కు అని సుప్రీంకోర్టు అంగీకరించింది. దీనిపై సుప్రీం కోర్టు ఎలాంటి నిషేధం విధించలేదు. ప్రధాన కార్యదర్శి నియామకం పై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జి) వీకే సక్సేనా మధ్య వివాదాలు కొన్నాళ్లుగా కొనసాగుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ విజ్ఞప్తిని విచారించిన ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు జెబి పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం, పేర్లను సామరస్యంగా నిర్ణయించడానికి లెఫ్టినెంట్ గవర్నర్, ముఖ్యమంత్రి ఎందుకు సమావేశం కాలేకపోతున్నారని ప్రశ్నించింది.
జూలై 17న కొత్త డీఈఆర్సీ చైర్మన్ నియామకంపై భిన్నాభిప్రాయాలను సుప్రీంకోర్టు లేవనెత్తింది. దేశ రాజధానిలోని విద్యుత్ నియంత్రణ సంస్థకు నేతృత్వం వహించే మాజీ న్యాయమూర్తుల పేర్లను చర్చించాల్సిందిగా కేజ్రీవాల్, ఎల్జీలను కోరారు. ఇద్దరు అధికారుల మధ్య సమావేశం జరిగినప్పటికీ, ప్రతిష్టంభన కొనసాగింది. చివరికి సుప్రీం కోర్టు DERC ఛైర్మన్‌ను నియమించింది. శుక్రవారం జరిగిన విచారణలో ప్రధాన కార్యదర్శి పదవికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసిన ఐదుగురు సీనియర్ బ్యూరోక్రాట్ల పేర్లను మంగళవారం ఉదయం 10.30 గంటలకు తమకు సమర్పించనున్నట్లు ధర్మాసనం తెలిపింది.
ఎలాంటి సంప్రదింపులు లేకుండానే కొత్త ప్రధాన కార్యదర్శిని నియమించడం లేదా ప్రస్తుత అత్యున్నత సివిల్ సర్వెంట్ నరేష్ కుమార్ పదవీకాలాన్ని పొడిగించడంపై కేంద్రం చేసిన చర్యకు వ్యతిరేకంగా ఢిల్లీ ప్రభుత్వం చేసిన పిటిషన్‌ను బెంచ్ విచారించింది. ప్రస్తుతం ఈ చట్టం కోర్టులో పరిశీలనలో ఉండగా, సంప్రదింపుల తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శిని ఎలా నియమిస్తారంటూ ఢిల్లీ ప్రభుత్వం పిటిషన్లో ప్రశ్నించింది. కేంద్రం నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేశారు.