Rules Ranjann: యువ నటుడు కిరణ్ అబ్బవరం వరసగా సినిమాలు చేస్తున్నాడు. అదృష్టం కలిసిరాక మంచి కథలు మాత్రం దొరకడం లేదు. ఇటీవల రూల్స్ రంజన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ మూవీ విడుదలకు ముందు మంచి బజ్ క్రియేట్ చేసింది. పాటలు కూడా బాగా క్లిక్ అయ్యాయి. చిత్రం బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. కథలో కొత్తదనం లేకపోవడంతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. నేహా శెట్టి అందాలు కూడా సినిమా విజయానికి దోహదపడలేదు.
ఇప్పుడు ఆ మూవీ OTTకి వస్తున్నట్లు తెలుస్తోంది. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రాన్ని రత్నం కృష్ణ దర్శకత్వం వహించారు. నవంబర్ 30వ తేదీన ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ థియేటర్లలో విడుదలై ఏడు వారాలు అయ్యింది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది. స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై దివ్యాంగ్ లావానియా, మురళీకృష్ణ వేమూరి సినిమాను నిర్మించారు. వెన్నెల కిషోర్, హైపర్ ఆది, హర్ష చెముడు, సుబ్బరాజు, అజయ్, గోపరాజు రమణ కీలక పాత్రలు పోషించారు. అమ్రిష్ సంగీతం సమకూర్చారు.