»Soon The Uttarkashi Tunnel 41 Workers Came Out Just 3 Meters Away
Uttarkashi tunnel: కాసేపట్లో బయటకు టన్నెల్ కార్మికులు..3 మీటర్ల దూరంలోనే
ఉత్తరకాశీ టన్నెల్ కుప్పకూలిన ఘటనలో 41 మంది కూలీలను బయటకు తీసుకొచ్చేందుకు చేపడుతున్న చర్యలు దాదాపు చివరకు వచ్చాయి. 57 మీటర్ల టన్నెల్ లోనికి వెళ్లేందుకు ఇప్పటికే 54 మీటర్లను తవ్వేశారు. కాసేపట్లో కూలీలను బయటకు తీసుకురానున్నారు.
Soon the uttarkashi tunnel 41 workers came out just 3 meters away
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ టన్నెల్(uttarkashi tunnel) కుప్పకూలి ఇప్పటికే 16 రోజులు దాటింది. దీపావళి రోజు నుంచి ఉత్తరకాశీలో నిర్మాణంలో ఉన్న సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు బయటకు తీసుకురావాలని అక్కడి ప్రభుత్వం సహా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిని బయటకు తీసే ప్రయత్నాలలో భాగంగా ఈరోజు కార్మికులు కాసేపట్లో బయటకు రానున్నారు. ఈరోజు 17వ రోజు వారిని బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది.
Breaking News: 41 workers trapped in Uttarkashi tunnel! Relatives instructed to prepare clothes and bags for rescued workers. Evacuation plan in place, Chinyalisaur hospital to receive rescued individuals. Stay tuned for updates.#UttarakhandTunnelRescue#UttarkashiRescue
ఆ బృందం కూలీలకు చేస్తున్న డ్రిల్లింగ్ దగ్గరవుతుండడంతో సొరంగం బయట పెద్ద ఎత్తున వారి కోసం సహాయక చర్యలు సిద్ధం చేశారు. దీంతోపాటు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ సహాయ మంత్రి, రిటైర్డ్ జనరల్ వీకే సింగ్ కూడా సిల్క్యారా చేరుకున్నారు. అతను మాన్యువల్ డ్రిల్లింగ్‌ను(works) పరిశీలించడానికి సొరంగం లోపలికి వెళ్ళాడు. సొరంగం లోపల 57 మీటర్ల వరకు ఎస్కేప్ పాసేజ్‌ను సిద్ధం చేసినట్లు సీఎం ధామి తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్‌ను త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు.
#WATCH | Uttarakashi (Uttarakhand) tunnel rescue | CM Pushkar Singh Dhami says, “Almost 52 metres has been done (pipe inserted). It is expected that there will be a breakthrough around 57 metres. 1 metre of the piple was pushed in before me, if 2 metres more of it is pushed in it… pic.twitter.com/cwVSYLtp8x
త్వరలోనే కూలీలను ఖాళీ చేయిస్తామన్న ఆశ ఉందని సీఎం ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి(pushkar singh dhami) అన్నారు. సొరంగం లోపల మాన్యువల్ డ్రిల్లింగ్ 57 మీటర్ల వరకు చేయాల్సి ఉందన్నారు. అంతేకాదు ఎప్పటికప్పుడూ రెస్క్యూ ఆపరేషన్ గురించి సమాచారం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. సొరంగం ముఖద్వారం వద్ద సోమవారం నీరు లీకేజీ కావడంతో ఓ ఆకారం ఏర్పడింది. స్థానికులు దీనిని శివుని మూర్తి అని పిలుస్తారు. సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు శివుడే వచ్చాడనీ, ఇప్పుడు వారికేది కాదని స్థానికులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.