Today Horoscope:ఈ రోజు మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ సమయంలో మంచి పని ప్రారంభించాలి. ఏ గడియ బాగుంటుంది. అనే వివరాలు తెలుసుకోవాలంటే హిట్ టీవీ వెబ్ న్యూస్లో ఉన్న రాశి ఫలాలు చూడగలరు.
మేష రాశి
వ్యవసాయ రంగంలో వారికి లాభంగా ఉంటుంది. తొందరపాటు వల్ల చేసే పనులు సక్సెస్ కావు. చెడును కోరేవారికి దూరంగా ఉండటం మంచిది. ఆకస్మిక భయం, ఆందోళన పడతారు. శారీరకంగా బలహీనంగా ఉంటారు.
వృషభ రాశి
మానసిక ఆందోళన చెందుతారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ప్రయత్నకార్యాలు ఆలస్యంగా సఫలం అవుతాయి. చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి చెందుతారు. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త పడాల్సి ఉంటుంది.
మిథున రాశి
కుటుంబ సౌఖ్యంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభంతో ఆనంద పడతారు. ఇతరులకు ఉపకారం చేసే కార్యాల్లో నిమగ్నం అవుతారు. స్త్రీల వల్ల లాభం ఉంటుంది. పేరు, ప్రతిష్ఠలు లభిస్తాయి. రుణబాధలు తొలగిపోతాయి. ఆరోగ్య సమస్య ఉంటే మెరుగు అవుతుంది.
కర్కాటక రాశి
ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. ఆకస్మిక ధన లాభం ఏర్పడుతుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. పిల్లలకు సంతోషాన్ని కలుగజేస్తారు. బంధు, మిత్రులను కలుస్తారు. కొత్త పనులకు చక్కని రూపకల్పన చేస్తారు.
సింహ రాశి
కుటుంబంలో చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది. పరిస్థితిని మీ అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది. ప్రయాణాల్లో అప్రమత్తత పాటించాల్సి ఉంది. ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు రుణ ప్రయత్నాలు చేస్తారు. బంధు, మిత్రుల సహాయ సహకారాలు ఆలస్యంగా లభిస్తాయి.
కన్య రాశి
రాజకీయ వ్యవహారాల్లో విజయం పొందుతారు. ప్రయత్న కార్యాలు సంపూర్ణంగా ఫలిస్తాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు. ఇతరులకు ఉపకరించే పనులు చేపడతారు. గౌరవ మర్యాదలు లభిస్తాయి.
తుల రాశి
ఆరోగ్యం గురించి జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశీ ప్రయత్నాలు నెరవేరతాయి. కుటుంబ కలహాలకు దూరంగా ఉంటే మేలు. సహనం అన్నివిధాలా శ్రేయస్కరం. డబ్బును పొదుపుగా వాడాలి.
వృశ్చిక రాశి
మనస్సు చంచలంగా ఉంటుంది. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా చూసుకోవాలి. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంది. చెడు సహవాసానికి దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి.
ధనుస్సు రాశి
పిల్లల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. పట్టుదలతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. అనారోగ్య బాధలు తొలగిపోతాయి.
మకర రాశి
అకాల భోజనాల వల్ల అనారోగ్యం ఏర్పడే అవకాశం ఉంది. పిల్లల పట్ల పట్టుదలతో ఉండటం మంచిది కాదు. కోపాన్ని తగ్గించుకోవడం అన్నివిధాలా శ్రేయస్కరం. కొత్త పనులు ప్రారంభించడం మంచిది కాదు.
కుంభ రాశి
అపకీర్తి రాకుండా జాగ్రత్తపడాలి. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. కలహాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి. దూర వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది.
మీన రాశి
విదేశీ ప్రయత్నం సులభం అవుతుంది. కుటుంబ కలహాలకు తావీయకూడదు. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది. పిల్లలతో జాగ్రత్త వహించడం మంచిది. వృత్తి, ఉద్యోగ రంగంలోని వారికి ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.