»India Donated 2 5 Million Dollars Palestine Refugees Unrwa
India donated: రూ.20 కోట్లు సాయంగా ప్రకటించిన భారత్
పాలస్తీనా శరణార్థుల కోసం ఐక్యరాజ్యసమితి ఏజెన్సీకి భారతదేశం US $ 2.5 మిలియన్లను(రూ.20,82,85,375) విరాళంగా ఇచ్చింది. ఆ శరణార్థులకు విద్య, ఆరోగ్య సంరక్షణ, సామాజిక సేవలతో సహా ఏజెన్సీ ప్రధాన కార్యక్రమాల సేవలకు మద్దతు ఇవ్వడానికి భారతదేశం సహకారాన్ని అందించింది.
India donated 2.5 million dollars Palestine refugees unrwa
పాలస్తీనా శరణార్థుల కోసం ఐక్యరాజ్యసమితికి భారత్(bharat) 2.5 మిలియన్ డాలర్లు(రూ.20,82,85,375) విరాళంగా అందజేసింది. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ (UNRWA) మంగళవారం గాజాలోని శరణార్థులకు భారతదేశం మద్దతును స్వాగతించింది. పాలస్తీనా శరణార్థులకు విద్య, ఆరోగ్య సంరక్షణ, సామాజిక సేవలతో సహా ఏజెన్సీ ప్రధాన కార్యక్రమాలు, సేవలకు మద్దతుగా భారతదేశం US$2.5 మిలియన్లను అందించింది.
జెరూసలేంలోని UNRWA ప్రాంతీయ కార్యాలయానికి భారతదేశం నిరంతర మద్దతును అందింస్తుందని భారత ప్రతినిధి తమరా అల్రిఫాయ్ తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో గాజా శరణార్థులకు మెరుగైన భవిష్యత్తు కోసం భారతదేశం సహకారాన్ని తాము స్వాగతిస్తున్నట్లు చెప్పారు. యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ ఫర్ పాలస్తీనా రెఫ్యూజీస్ (UNRWA) 1950 నుండి పనిచేస్తోంది. ఇది ప్రస్తుతం పాలస్తీనా శరణార్థులకు ప్రత్యక్ష సహాయ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఇది UN సభ్య దేశాల నుంచి స్వచ్ఛంద విరాళాల ద్వారా నిధులు సమకూరుస్తుంది.
నవంబర్ నెలలో భారతదేశం ఈజిప్టులోని అల్ అరిష్ విమానాశ్రయం ద్వారా పాలస్తీనా పౌరులకు(Palestine refugees) 32 టన్నుల సహాయ సామగ్రిని పంపిణీ చేసింది. 2018 నుంచి భారతదేశం UNRWAకి 27.5 మిలియన్ US డాలర్లు ఇచ్చింది. 2020 సంవత్సరంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో రాబోయే రెండేళ్లలో UNRWAకి 10 మిలియన్ US డాలర్లను అందజేస్తామని భారతదేశం ప్రకటించిందని వెల్లడించారు.
మరోవైపు హమాస్-ఇజ్రాయెల్ మధ్య భీకర పోరు కొనసాగుతోంది. గాజా ఆధారిత(Gaza Strip) ఉగ్రవాద సంస్థ హమాస్ స్థావరాలను ఇజ్రాయెల్ నిరంతరం లక్ష్యంగా చేసుకుంటోంది. అక్టోబర్ 7న హమాస్ అకస్మాత్తుగా ఇజ్రాయెల్ పై ఐదు వేల రాకెట్లను ప్రయోగించి దాడి చేసింది. ఆ తర్వాత రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైంది. భీకర యుద్ధం మధ్య, గాజాలోని పాలస్తీనియన్లకు ప్రాథమిక సేవలను అందించేందుకు UNRWA కృషి చేస్తోంది. యుద్ధం తర్వాత, గాజా జనాభాలో మూడింట రెండొంతుల మంది తమ ఇళ్లను వదిలి పారిపోవాల్సి వచ్చింది.