»The First Video Release Of Workers Trapped In The Uttarkashi Tunnel
Uttarkashi tunnel:లో చిక్కుకున్న కార్మికుల మొదటి వీడియో రిలీజ్..అంతా సేఫ్!
ఉత్తరకాశీ టన్నెల్ ప్రమాదం అందరినీ కలచివేసింది. నవంబర్ 12న యమునోత్రి హైవేలోని సిల్క్యారా బ్యాండ్ సమీపంలో సిల్క్యారా టన్నెల్ ముఖద్వారం లోపల 200 మీటర్ల దూరంలో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో 41 మంది కూలీలు అక్కడ చిక్కుకుపోయారు. అయినప్పటికీ, వారికి ఆహారం, ఆక్సిజన్ నిరంతరం సరఫరా చేయబడుతున్నాయి. తాజాగా సొరంగం లోపల నుంచి తొలి వీడియో బయటకు వచ్చింది. అందులో చిక్కుకున్న కూలీల పరిస్థితి ఎలా ఉందో మీరే వీడియోలో చూసేయండి మరి.
The first video release of workers trapped in the Uttarkashi tunnel
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో కూలిపోయిన సిల్క్యారా సొరంగం(Silkyara tunnel)లో చిక్కుకున్న కార్మికుల మొదటి దృశ్యాలు మంగళవారం ఉదయం వెలుగులోకి వచ్చాయి. కూలిపోయిన సిల్క్యారా సొరంగం శిథిలాల ద్వారా ఆరు అంగుళాల వెడల్పు గల పైప్‌లైన్‌ను పంపించిన ఒక రోజు తర్వాత మరో అభివృద్ధి జరిగింది. తొమ్మిది రోజులు లోపల చిక్కుకున్న 41 మంది కార్మికులకు పెద్ద మొత్తంలో ఆహారాన్ని సరఫరా చేసిన తర్వాత వారికి సంబంధించిన వీడియో బయటకొచ్చింది. ఖిచ్డీని వెడల్పాటి నోటి ప్లాస్టిక్ బాటిళ్లలో ప్యాక్ చేసి కార్మికులకు పంపిణీ చేశారు.
VIDEO | First visuals of workers stuck inside the collapsed Silkyara tunnel in #Uttarkashi, Uttarakhand.
Rescuers on Monday pushed a six-inch-wide pipeline through the rubble of the collapsed tunnel allowing supply of larger quantities of food and live visuals of the 41 workers… pic.twitter.com/mAFYO1oZwv
ప్రత్యామ్నాయ ఆరు అంగుళాల ఫుడ్ పైప్‌లైన్(pipeline) ద్వారా పంపబడిన ఎండోస్కోపిక్ కెమెరాను ఉపయోగించి విజువల్స్ క్యాప్చర్ చేయబడ్డాయి. వీడియోలో కార్మికులు, పసుపు, తెలుపు హెల్మెట్లు ధరించి పైప్‌లైన్ ద్వారా వారికి పంపిన ఆహార పదార్థాలను స్వీకరించడం.. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కనిపిస్తుంది. ఇది చూసిన కార్మికుల కుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సొరంగంలో నిర్వహిస్తున్న రెస్క్యూ ఆపరేషన్ ఇన్చార్జి కల్నల్ దీపక్ పాటిల్ మాట్లాడుతూ.. ఈ పైప్‌లైన్ ద్వారా గంజి, కిచడీ, కట్ యాపిల్స్, అరటిపండ్లు పంపవచ్చని తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న భద్రతా సిబ్బంది నిపు కుమార్ మాట్లాడుతూ కమ్యూనికేషన్ ఏర్పాటు చేయడానికి పైప్‌లైన్‌కు వాకీ-టాకీ, రెండు ఛార్జర్లను కూడా పంపినట్లు చెప్పారు.
అనేక దిశల నుంచి చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా భారతీయ వైమానిక దళం ఒక C-17, రెండు C-130J సూపర్ హెర్క్యులస్ రవాణా విమానాల ద్వారా 36 టన్నుల బరువున్న యంత్రాలను పంపిణీ చేసింది. సిల్క్యారా టన్నెల్ నుంచి ‘ఎగ్జిట్’ తయారీ పనులు మళ్లీ ప్రారంభం కానున్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. శుక్రవారం మధ్యాహ్నం గట్టి ఉపరితలం ఢీకొని ఆగిపోయిన యంత్ర భాగాలను ఢిల్లీకి చెందిన ఇంజినీరింగ్ బృందం మార్చివేసింది. కార్మికుల ఆరోగ్యం గురించి అడిగిన వైద్యుడు ప్రేమ్ పోఖ్రియాల్, రెస్క్యూ వర్కర్లకు మంగళవారం భోజనంగా సోయా బీన్స్, బఠానీలతో కూడిన మూంగ్ దాల్ ఖిచ్డీని పంపాలని సూచించారు. అంతే కాకుండా అరటిపండు కూడా పంపాలని తెలిపారు.