»After Brs Wins Ministry Of Tourism Will Ask Minister Ktr
BRS గెలిచాక.. పర్యాటకశాఖ అడుగుతా : మంత్రి కేటీఆర్
తెలంగాణలో పర్యాటకరంగానికి అపార అవకాశాలున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. కొత్త రిజర్వాయర్ల నిర్మాణంతో ఈ రంగంలో ఆకర్షణీయమైన అవకాశాలున్నాయన్నారు. తమ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే తనకు పర్యాటకశాఖ కేటాయించమని సీఎం కేసీఆర్‌ను అడుగుతానని చెప్పారు.
తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రచారంలో అధికార బీఆర్ఎస్ దూసుకెళ్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ (CMKCR) రోజుకు నాలుగు చొప్పున నియోజవర్గాల్లో ప్రజాశీర్వదసభల్లో పాల్గొంటుండగా.. మంత్రులు హరీష్, కేటీఆర్, కవితలు అన్నీ తామై పలు నియోజకవర్గాలు, కార్నర్ మీటింగ్‌లలో ప్రసంగిస్తున్నారు. ఇక ప్రత్యేక కార్యక్రమాలతో మంత్రి కేటీఆర్ (Minister KTR) తమ తొమ్మిదన్నరేళ్ల పాలనను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ (BNI) ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న ఆయన.. మూడోసారి బీఆర్ఎస్ (BRS) అధికారంలోకి వస్తే తాను తీసుకునే శాఖ విషయమై కీలక కామెంట్స్ చేశారు. మళ్లీ తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తే.. తనకు పర్యాటకశాఖ ఇవ్వమని ముఖ్యమంత్రిని అడుగుతానని కేటీఆర్ వెల్లడించారు. ఆరు దశాబ్దాల్లో కాంగ్రెస్ చేయలేని అభివృద్ధిని తమ ప్రభుత్వం ఆరున్నరేళ్లలో చేసి చూపించిందని అన్నారు. తెలంగాణ(Telangana)లో పర్యాటకరంగానికి అపార అవకాశాలున్నాయని, పెద్దఎత్తున రిజర్వాయర్ల నిర్మాణం జరిగిన తర్వాత ఇవి ఇంకా మెరుగయ్యాయని చెప్పారు. వైద్య, ఆధ్యాత్మిక, క్రీడా, అటవీ పర్యాటకాలకు తెలంగాణలో మంచి అవకాశాలున్నాయని వెల్లడించారు.
హైదరాబాద్ (Hyderabad) పరిసరాల్లో వారాంతపు విహార కేంద్రాలను అభివృద్ధి చేయాల్సి ఉంది. గండిపేట, హిమాయత్‌సాగర్‌ల వద్ద కూడా పర్యావరణానికి హాని జరగకుండా పర్యాటకులకు వసతులను పెంపొందించాల్సి ఉంది. మూతపడ్డ పరిశ్రమలకు సంబంధించి సాంకేతిక-ఆర్థిక అంశాలను విశ్లేషించి, బ్యాంకులతో మాట్లాడి రుణసదుపాయాన్ని పునర్వ్యవస్థీకరించడం కోసం ప్రత్యేక పారిశ్రామిక పురోభివృద్ధి విభాగాన్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ పరిసరాల్లో వారాంతపు విహార కేంద్రాలను అభివృద్ధి చేయాల్సి ఉందని, గండిపేట, హిమాయత్‌సాగర్(Himayatsagar)ల వద్ద కూడా పర్యావరణానికి హాని జరగకుండా పర్యాటకులకు వసతులను పెంపొందించాల్సి ఉందని మంత్రి కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ హయాంలో తీవ్రమైన విద్యుత్ కోతలు ఉండవనీ.. పారిశ్రామిక కంపెనీలు తీవ్ర ఇబ్బందులు పడ్డాయని మంత్రి కేటీఆర్ అన్నారు.హైదరాబాద్ అభివృద్ధి గురించి దేశం మొత్తం మాట్లాడుకుంటోందన్నారు. తమిళసూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth), బాలీవుడ్ నటులు, బీజేపీ ఎంపీ సన్నీదేవల్ కూడా చెప్పారని అన్నారు. కానీ ప్రతిపక్ష నేతలకే ఇక్కడ అభివృద్ధి కనిపించడం లేదని మంత్రి కేటీఆర్ అన్నారు.