»Australia Team Who Won Against South Africa And Reached The Final
SAvsAUS: సౌతాఫ్రికాపై గెల్చి ఫైనల్ చేరిన ఆసీస్
ప్రపంచ కప్ 2023లో లీగ్ దశలో అద్భుతంగా ఆడిన దక్షిణాఫ్రికా జట్టు రెండో సెమీస్‌లో మాత్రం ఆస్ట్రేలియా జట్టుపై తడబడింది. దీంతో కంగారూల చేతిలో కేవలం మూడు వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో ఇక ఫైనల్ పోరులో నవంబర్ 19న భారత జట్టుతో ఆసీస్ తలపడనుంది.
australia team who won against South Africa and reached the final
నేడు ODI ప్రపంచ కప్ 2023లో రెండవ సెమీ-ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠగా కొనసాగింది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన పోరులో ఆసీస్ జట్టు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఆ క్రమంలో ఆటకు దిగిన ఆటగాళ్లలో మిల్లర్ 101, క్లాసెన్ 47 మినహా మిగతా ఆటగాళ్ల పెద్దగా పరుగులు చేయలేదు. అదే క్రమంలో ఆసీస్ బౌలర్లు దీటుగా ఎదుర్కొవడంతో 49.4 ఓవర్లలోనే అన్ని వికెట్లు కోల్పోయి సౌతాఫ్రికా 212 పరుగులు చేసింది. ఆ క్రమంలో ఆసీస్ బౌలర్ స్టార్క్, కమిన్స్ చెరో 3 వికెట్లు పడగొట్టగా, హెడ్, హాజిల్‌వుడ్ తలో ఇద్దరిని ఔట్ చేసి బెస్ట్ ఇచ్చారు.
ఇక ఆ తర్వాత 213 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ ఆటగాళ్లలో ట్రావిస్ హెడ్ 62, డేవిడ్ వార్నర్ 29, స్టీవెన్ స్మిత్ 30 రన్స్, జోష్ ఇంగ్లిస్ 28 రన్స్ చేసి జట్టు గెలుపునకు తోడ్పాటునందించారు. ఇక సౌతాఫ్రికా బౌలర్లలో తబ్రైజ్ షమ్సీ 2 వికెట్లు, గెరాల్డ్ కోయెట్జీ 2, కగిసో రబడ, మార్కరమ్, కేశవ్ మహారాజ్ చెరో వికెట్ తీశారు. అప్పటికీ బౌలర్లు పరుగులను కట్టిడి చేయడానికి తీవ్రంగా శ్రమించారు. కానీ..చివరకు ఆసీస్ జట్టు గెలుపు తప్పలేదు.
లీగ్ దశలో జరిగిన పలు మ్యాచ్‌లలో అనేక విజయాలు సాధించిన దక్షిణాఫ్రికా ఈ ఆటలో మాత్రం వెనుకబడింది. అదే సమయంలో ఆస్ట్రేలియా జట్టు కూడా అద్భుతమైన ఫామ్‌లోకి వచ్చి సౌతాఫ్రికా ఆటగాళ్లను తీవ్రంగా కట్టిడి చేసింది. దీంతో ఆసీస్ జట్టు గెలవడంతో ఫైనల్ చేరింది. ఈ క్రమంలో టీమిండియాతో నవంబర్ 19న ఆసీస్ జట్టు అహ్మదాబాద్ వేదికగా తలపడనుంది.