అభిమానులతో చిట్ చాట్ నిర్వహించిన క్రమంలో టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ నెటిజన్ల కామెంట్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎప్పుడు సరదాగా ఉండే హీరో ఇలా ఫైర్ అవడంతో సోషల్ మీడియాలో ఈ పోస్ట్ కాస్తా ప్రస్తుతం వైరల్ అవుతుంది.
Sai Dharam Tej మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్(Sai Dharam Tej) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పిల్లా నువ్వు లేని జీవితం సినిమాతో తెలుగు తెరపై అడుగుపెట్టి వరుసగా సినిమాలు చేస్తూ మంచి పేరు సంపాదించుకున్నారు. రిజల్ట్‌తో సంబంధం లేకుండా తన అభిమానులను అలరిస్తున్న ఈ హీరో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఇటివల తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్నారు. తన కమ్‌బ్యాక్ మూవీ విరూపాక్ష(Virupaksha)తో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న తేజ్.. ప్రస్తుతం గాంజా శంకర్(Ganja Shankar) అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. దీంతో పాటు పలు సినిమాలను లైన్ అప్‌లో కూడా పెట్టాడు. ఈ నేపథ్యంలోనే తన అభిమానులతో #Asksdt అనే హ్యాష్ ట్యాగ్‌తో తాజాగా చిట్ చాట్ నిర్వహించాడు. పలువురు అభిమానులు తనను ప్రశ్నించిగా.. మీ సినిమాలలో మీకు చాలా సంతృప్తిని ఇచ్చిన పాత్రలు ఏమిటని ఓ ఫ్యాన్ అడిగాడు. దీనికి సమాధానంగా చిత్రలహరి, రిపబ్లిక్ సినిమాల్లోని పాత్రలు తనకు చాలా సంతృప్తిని ఇచ్చాయని పేర్కొన్నాడు.
అయితే రిపబ్లిక్(Republic) స్పెల్లింగ్ రిలబ్లిక్ అని తప్పుగా పడింది. వెంటనే దీనిపై మరో నెటిజెన్ సెటైరిక్‌గా స్పందించాడు. అది రిలబ్లిక్(#relublic) కాదురా రిపబ్లిక్.. ఎప్పుడైనా స్కూల్ కి వెళ్లావా అని హీరోకు ట్యాగ్ చేస్తూ పోస్ట్ పెట్టాడు. ఈ వ్యాఖ్యలపై తేజ్ వెంటనే స్పందించాడు. తాను స్కూల్లో వెళ్లానని, అక్కడ తమకు గౌరవం నేర్పించారని, మీ స్కూల్లో నీకు నేర్పించలేదా.. నేర్పించకపోతే నేర్చుకో అని ఘాటుగా బదులిచ్చాడు. దీనికి సదరు నెటిజన్ నన్ను క్షమించు అన్నా.. నీవు రిప్లై ఇవ్వవేమో అని ఇలా రాశాను. నువ్వుంటే చాలా ఇష్టం అని రాసుకొచ్చాడు. దీనిపై మరికొందరు అభిమానులు స్పందించారు. ఇలా వ్యక్తిగతంగా మాట్లాడటం కరెక్ట్ కాదు బ్రదర్ అని బదులిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.