ఖమ్మం నగరంలోని గుట్టల బజార్ రాధాకృష్ణ ఆసుపత్రి సమీపంలో సోమవారం మధ్యాహ్నం దొంగతనం జరిగింది. హోండా షైన్ బైక్పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి ఓ వృద్ధురాలి మెడలోని మూడు తులాల బంగారు గొలుసును తెంచుకుపోయాడు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితుడి ఫోటోలను త్రీ టౌన్ పోలీసులు బుధవారం విడుదల చేశారు. నిందితుడిని గుర్తిస్తే 8712659115కు సమాచారం అందించాలన్నారు.