»Rajinikanth Gave A Diwali Treat To His Fans Lal Salaam Teaser Release
Lal Salaam: ఫ్యాన్స్‌కు దీపావళి ట్రీట్ ఇచ్చిన రజినీకాంత్..‘లాల్ సలామ్’ టీజర్ రిలీజ్
రజినీ కాంత్ నటిస్తున్న తాజా చిత్రం లాల్ సలామ్ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ మూవీ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోంది. రజినీకాంత్ కూతురు ఐశ్వర్య ఈ మూవీకి దర్శకత్వం వహిస్తోంది.
తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ (Rajinikanth) జైలర్ సినిమాతో మంచి సక్సెస్ సాధించారు. అదే జోష్‌లో ఇప్పుడు మరిన్ని మూవీస్ చేసేందుకు సిద్దమయ్యారు. వాటిలో తన కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో లాల్ సలామ్ (Lal Salaam) అనే మూవీ తెరకెక్కుతోంది. ఇందులో విష్ణువిశాల్, విక్రాంత్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ మూవీలో టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కూడా ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన టైటిల్ పోస్టర్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఈ మూవీ తమిళ్ టీజర్ రిలీజ్ అయ్యింది.
లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరణ్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. దీపావళి పండగ కానుకగా తన ఫ్యాన్స్‌కు రజినీ ట్రీట్ ఇచ్చారు. ఈ మూవీ నుంచి టీజర్‌ను మేకర్స్ ఈ రోజు విడుదల చేశారు. ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్‌ని టీవీలో చూసి ఉంటారుకానీ డైరెక్ట్‌గా చూశారా అంటూ ఓ క్రికెట్ మ్యాచ్‌తో ఈ మూవీ ప్రారంభమవుతుంది. టీజర్ చూస్తే ఈ మూవీ ఓ స్పోర్ట్స్ డ్రామాలా అనిపించింది. హిందూ ముస్లింల మధ్య గొడవల మధ్య సాగే సీన్స్ కట్ చేసి టీజర్లో చూపించారు.
లాల్ సలామ్ మూవీలో రజనీకాంత్ మొయిదీన్ భాయ్ అనే స్పెషల్ రోల్లో కనిపించనున్నాడు. తన సిగ్నేచర్ స్టైల్లో విలన్లను రజనీ కొట్టడం టీజర్‌కు హైలెట్‌గా నిలిచింది. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన కై పొ చే అనే మూవీకి ఈ మూవీ రీమేక్‌గా రూపొందుతున్నట్లు సమాచారం. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ (AR rehaman) సంగీతం అందిస్తుండగా త్వరలోనే ఈ మూవీ విడుదల తేదీని వెల్లడిస్తామని మేకర్స్ తెలిపారు.