»Australias Great Victory Over Bangladesh Marshs Heroism
World Cup : బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం..మార్ష్ వీరవిహారం
వరల్డ్ కప్‌లో ఆసీస్ వరుసగా ఏడో విజయాన్ని నమోదుచేసింది. పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కంగారులు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది
వరల్డ్ కప్(World Cup)లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 307 లక్ష్యంతో ఛేదనకు దిగిన ఆసీస్ జట్టు 2 వికెట్లు నష్టానికి 44.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. మిచెల్ మార్ష్ (Michelle Marsh) భారీ సెంచరీతో వీరవిహారం చేయడంతో బంగ్లా బౌలర్లు కుదేలయ్యారు. ఈ ఆజానుబాహుడు 132 బంతుల్లో 177 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మార్ష్ స్కోరులో 17 ఫోర్లు, 9 భారీ సిక్సర్లు ఉన్నాయి.ఆసీస్ ఇన్నింగ్స్ లో ఓపెనర్ ట్రావిస్ హెడ్ 10 పరుగులకే వెనుదిరగ్గా, మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (David Warner) 53 పరుగులతో రాణించాడు. అనంతరం మార్ష్, స్టీవ్ స్మిత్ జోడీ మరో వికెట్ పడకుండా జట్టును విజయతీరాలకు చేర్చారు. స్మిత్ 64 బంతుల్లో 63 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. బంగ్లాదేశ్ (Bangladesh) బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 1, ముస్తాఫిజూర్ రెహ్మాన్ 1 వికెట్ తీశారు. ఈ విజయం అనంతరం ఆసీస్ (Aussies) మొత్తం 9 మ్యాచ్ ల్లో 7 విజయాలతో 14 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచింది. సెమీస్ లో ఆసీస్.. దక్షిణాఫ్రికాతో తలపడనుంది.