»Diwali Festival 2023 Will Be Celebrated On 12th Or 13th
Diwali 2023: ఈసారి దీపావళి పండుగ 12 లేదా 13న జరుపుకోవాలా?
హిందూ మతంలో దీపావళి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏటా కార్తీక మాసంలోని కృష్ణ పక్ష అమావాస్య తేదీన జరుపుకుంటారు. అయితే ఈసారి అమవాస్య నవంబర్ 12, 13 రెండు తేదీల్లో వస్తుంది. ఈ నేపథ్యంలో అసలు పండుగ ఏ రోజు జరుపుకోవాలనే సందిగ్ధం పలువురిలో నెలకొంది. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
Diwali festival 2023 will be celebrated on 12th or 13th
దీపావళిని సర్వ సిద్ధి రాత్రి అని కూడా పిలుస్తారు. ఎందుకంటే మనం గణేష్, సరస్వతి దేవితో పాటు లక్ష్మీ దేవిని కూడా పూజిస్తాము. ఈ పండుగను ప్రతి సంవత్సరం కృష్ణ పక్ష అమావాస్య రోజున ఘనంగా జరుపుకుంటారు. అయితే ఈసారి దీపావళి పండుగ రెండు రోజులు వస్తుందని చెబుతున్నారు. ఈ క్రమంలో పలువురు భక్తులు పండుగ ఏ రోజు జరుపుకోవాలని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ సంవత్సరం కార్తీక మాస అమావాస్య నవంబర్ 12, 2023న మధ్యాహ్నం 2:44 గంటలకు ప్రారంభమై 13 నవంబర్ 2023న మధ్యాహ్నం 2:56 గంటలకు ముగుస్తుంది. పండుగ రోజు ఉదయం (ఉదయ తిథి) నుంచి ప్రారంభమవుతుంది. అయితే దీపావళి లక్ష్మీ పూజ రాత్రి సమయంలో నిర్వహించుకోవాలని అంటున్నారు. ఈ క్రమంలో దీపావళి నవంబర్ 12, 2023న జరుపుకోవాలని చెబుతున్నారు.
దీపావళి 2023: లక్ష్మీ పూజ ముహూర్తం
లక్ష్మీ పూజ (ప్రదోషకాలం) – సాయంత్రం 05:39 నుంచి రాత్రి 07:35 వరకు (12 నవంబర్ 2023)
వృషభ కాల – సాయంత్రం 05:39 నుంచి రాత్రి 07:35 వరకు
లక్ష్మీ పూజ (నిషిత కాల్) – 12 నవంబర్ 2023, రాత్రి 11:39 నుంచి 13 నవంబర్ 2023 వరకు, తెల్లవారుజామున 12:32
సింగ లగ్నము – తెల్లవారుజామున 12:10 నుంచి తెల్లవారుజామున 02:27 (13 నవంబర్ 2023)
దీపావళి 2023: క్యాలెండర్
ధన్తేరస్ – 10 నవంబర్ 2023
నరక చతుర్దశి – 12 నవంబర్ 2023
దీపావళి – 12 నవంబర్ 2023
గోవర్ధన్ పూజ – 14 నవంబర్ 2023
భాయ్ దూజ్ – 15 నవంబర్ 2023
దీపావళి హిందూ మతం ప్రధాన పండుగ. ఈ పండుగను ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోని అమావాస్య రోజున జరుపుకుంటారు. ఈ రోజున దేశం మొత్తం దీపాలతో వెలిగిపోతుంది. ఈ రోజున లక్ష్మిదేవి తన భక్తుల ఇళ్లను సందర్శిస్తుందని, వారికి సంపద, ధాన్యాలను అనుగ్రహిస్తుందని హిందూ మత విశ్వాసం. ప్రజలు ఈ రోజున లక్ష్మీ దేవిని ఆరాధించడానికి, వారి జీవితంలో ఆనందం, శ్రేయస్సు కోసం భక్తులు ప్రార్థిస్తారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీపావళి పండుగ సందర్భంగా ఏపీ ప్రభుత్వం నవంబర్ 13న సెలవు దినంగా ప్రకటించింది. ప్రధాన కార్యదర్శి కె.ఎస్. ముందుగా సెలవు దినంగా ప్రకటించిన నవంబర్ 12న కాకుండా నవంబర్ 13వ తేదీని సాధారణ సెలవు దినంగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు.