Ali Mercchant: ప్రముఖ టీవీ యాక్టర్ అలీ మర్చంట్ మోడల్ అందలీబ్ జైదీని వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం వారి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఏడాది అక్టోబర్‌లో ఈ జంట నిశ్చితార్థం జరిగింది. ఇప్పుడు వారిద్దరూ నవంబర్ 4న పెళ్లి చేసుకోబోతున్నారు. తన పెళ్లికి సంబంధించిన అందమైన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. చిత్రాల్లో ఇద్దరూ చాలా అందంగా కనిపిస్తున్నారు.
నటుడు, యాంకర్, డీజే, నిర్మాత అలీ మర్చంట్ ఇప్పుడు వివాహం చేసుకున్నారు. ఇది అలీ మర్చంట్‌కి మూడవ వివాహం. అతని మొదటి వివాహం నటి సారాతో జరిగింది. ఇది రెండు నెలలు కూడా కొనసాగలేదు. ఆ తర్వాత ఆనం మర్చంట్‌తో అతని రెండో వివాహం అయింది. ఐదేళ్ల తర్వాత ఆనం, అలీ కూడా విడిపోయారు. ఇప్పుడు హైదరాబాద్ మోడల్ అందాలీబ్ జైదీతో మూడో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి ఫోటోలను పంచుకుంటూ, ‘ మనం ఎప్పటికీ కలిసి నడవగలం, ఇప్పుడు హ్యాపీలీ స్టార్స్’ అని క్యాప్షన్ రాసుకొచ్చారు. అలీ మర్చంట్, అందలీబ్ జైద్ వివాహానికి బంగారు రంగు దుస్తుల్లో చాలా అందంగా కనిపించారు.
అతను ఇంకా ఇలా రాసుకొచ్చారు.., ‘మీతో నవ్వడం, మీతో ఏడవడం, మిమ్మల్ని శ్రద్ధగా చూడడం, మీతో ప్రతిదీ పంచుకోవడం నాకు చాలా ఇష్టం. నేను మీతో పరుగెత్తడం, మీతో నడవడం, మీతో జీవించడం చాలా ఇష్టం. నేను నా జీవితాంతం గడిపే వ్యక్తిగా మీరు ఉండాలని కోరుకుంటున్నాను. నేను మీతో ఉండాలని, ఎల్లప్పుడూ మీకు మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నాను. నేను నిన్ను ఎల్లప్పుడూ ప్రేమిస్తుంటాను’. అని పేర్కొన్నారు.