»India Enter In To Semis After Winning Against Sri Lanka By 302 Runs
World Cup 2023: శ్రీలంకపై గెల్చి సెమీస్ దూసుకెళ్లిన భారత్
2023 ప్రపంచ కప్ సెమీఫైనల్‌కు వెళ్లే క్రమంలో భారత జట్టు కీలకమైన జైత్ర యాత్రను కొనసాగించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 7 మ్యాచులు వరుసగా గెల్చి అద్భుతమైన రికార్డు సాధించింది. తాజాగా శ్రీలంక జట్టుపై 302 పరుగుల తేడాతో గెలుపొందింది.
India enter in to semis after winning against Sri Lanka by 302 runs
ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో 33వ మ్యాచ్ శ్రీలంకతో జరుగగా..భారత ఆటగాళ్లు అదరగొట్టి విజయం సాధించారు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ గ్రాండ్ గా గెలిచి టీమిండియా సెమీఫైనల్ దూసుకెళ్లింది. అయితే మొదట టాస్ గెల్చిన లంక ఆటగాళ్లు బౌలింగ్ ఎంచుకున్నారు. ఆ క్రమంలో ఆటకు దిగిన భారత ఆటగాళ్లలో ప్రధానంగా శుభ్‌మన్ గిల్ 92, విరాట్ కోహ్లీ 88, శ్రేయాస్ అయ్యర్ 82 రన్స్ చేయగా..భారత్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. ఆ క్రమంలో లంక బౌలర్లలో కేవలం దిల్షాన్ మధుశంకనే 6 వికెట్లు తీయడం విశేషం.
ఇక తర్వాత 358 పరుగుల భారీ లక్ష్యంలో బరిలోకి దిగిన లంక ఆటగాళ్లు మొదటి నుంచి బిక్కు బిక్కు మంటూ ఆడసాగారు. ఆ క్రమంలో భారత భౌలర్లు దీటుగా బౌలింగ్ చేయడంతో శ్రీలంక జట్టు 55 పరుగులకే 10 వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో భారత బౌలర్లైన మహ్మద్ షమీ 5, మహ్మద్ సిరాజ్ 3, జస్ప్రీత్ బుమ్రా 1, జడేజా 1 వికెట్ తీసి అద్భుతమైన బౌలింగ్ వేసి భారత జట్టు అద్భుతమైన గెలుపునకు తోడ్పాటునందించారు. ఈ టోర్నీలో ఇప్పటివరకు భారత్ తిరుగులేని జట్టుగా ఆరు విజయాలు సాధించింది. ఈ క్రమంలో పాయింట్ల పట్టికలో 14 పాయింట్లతో అగ్రస్థానంలోకి టీమిండియా మళ్లీ చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇదే జోరును టీమిండియా కొనసాగిస్తే ఈసారి వరల్డ్ కప్ టైటిల్ మనదేనని చెప్పవచ్చు.