‘Tiger Nageswara Rao’ కలెక్షన్స్.. బాలయ్య సినిమాలో సగం కూడా లేవు!
దసరా రేసులో టైగర్ నాగేశ్వర రావు వచ్చాడు మాస్ మహారాజా రవితేజ. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయిన ఈ సినిమా పర్వాలేదనే టాక్ సొంతం చేసుకుంది. అయితే మొదటి నుంచి భారీ వసూళ్లు రాబట్టిందని చెప్పిన మేకర్స్ తాజాగా ఓ ఫిగర్ చెప్పారు.
Tiger Nageswara Rao: మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ ఫిల్మ్ ‘టైగర్ నాగేశ్వరరావు’ అక్టోబర్ 20న థియేటర్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. బాలయ్య ‘భగవంత్ కేసరి’కి పోటీగా రిలీజ్ అయిన ఈ సినిమా.. రన్ టైం ఎక్కువ అవడంతో టాక్ కాస్త తేడా కొట్టింది. అందుకే.. వెంటనే ట్రిమ్ చేశారు మేకర్స్. ఫైనల్‌గా ట్రిమ్డ్ వెర్షన్‌కు మంచి రెస్పాన్స్ వస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. ఇప్పటి వరకు 50 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టినట్టుగా ప్రకటించారు మేకర్స్. సెకండ్ వీక్‌లోను టైగర్ నాగేశ్వర రావు దూసుకుపోతునట్టుగా చెప్పుకొచ్చారు. అయితే.. బాలయ్య భగవంత్ కేసరి మాత్రం ఫస్ట్ వీక్‌లో 112 కోట్లకు పైగా రాబట్టింది. కానీ పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అయిన టైగర్ నాగేశ్వర రావు 50 కోట్లతోనే సరిపెట్టుకుంది.
భగవంత్ కేసరిలో కనీసం సగం వసూళ్లు కూడా రాబట్టలేకపోయింది. అయినా కూడా రవితేజ కెరీర్లో బిగ్గెస్ట్ కలెక్షన్ అందుకునే దిశగా టైగర్ నాగేశ్వర్ రావు దూసుకుపోతోంది. ఈ వీకెండ్లో లెక్క మరింతగా పెరిగే ఛాన్స్ ఉంది. స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వర రావు జీవిత ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు వంశీ దర్శకత్వం వహించాడు. అభిషేక్ అగర్వాల్ ప్రొడక్షన్స్ పై అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. రవితేజ చేసిన ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కూడా ఇదే. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ నుపూర్ సనన్ హీరోయిన్గా నటించగా.. రేణు దేశాయ్ కీ రోల్ ప్లే చేసింది. GV ప్రకాష్ కుమార్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. మరి టైగర్ ఫైనల్ ఫిగర్ ఎక్కడి వరకు వచ్చి ఆగుతుందో చూడాలి.