»Mla Raghunandana Rao Comments On The Cm Candidate In Gajwel Vijaya Sankharavam Sabha
MLA Raghunandana: బీజేపీ వస్తే.. ముఖ్యమంత్రి అయ్యేది వారే.!
పది సంవత్సరాల అవినీతి పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం వచ్చిందని ఎమ్మెల్యే రఘునందనరావు అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ మాట తప్పని పార్టీ అని, పేదల బతుకులు మారాలంటే బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు.
MLA Raghunandana Rao comments on the cm candidate in Gajwel Vijaya Sankharavam Sabha.
MLA Raghunandana: తెలంగాణ(Telangana)లో అసెంబ్లీ ఎన్నికల(TelanganaElections2023) హీట్ పెరిగింది. అన్ని పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. తాజాగా బీజేపీ(BJP) గజ్వేల్(Gajwel) విజయశంఖారావం సభ నిర్వహించింది. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు(Raghunandana) కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ బిడ్డనే ముఖ్యమంత్రి అవుతారని ప్రకటన చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ అవినీతి పాలనకు చరమగీతం పాడాల్సిన సయమం వచ్చిందన్నారు. దసరా పండుగ అయిపోయి మూడు రోజులు అవుతోన్న పల్లెల్లో ప్రజలకు గొర్లు, మేకలు కోసి బీజేపీ మీటింగ్లకు రాకుండా అధికార పార్టీ అడ్డుపడుతుందని అన్నారు. ఈ సారి గజ్వేల్లో ఎలాగో ఓడిపోతా అని కేసీఆర్ భయంతోనే కామారెడ్డికి పారిపోయాడని ఎద్దేవా చేశారు.
గజ్వేల్లో ఎవరికి డబుల్ బెడ్రూం ఇళ్లు రాలేదని, పేదల భూములు లాక్కున్నారని ధ్వజమెత్తారు. ఆనాటి కలెక్టర్ కేసీఆర్ కాళ్లు పట్టుకుని ఎమ్మెల్సీ అయ్యాడని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం మాట తప్పదని, ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచం గర్వించదగ్గ నేత అని అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ బిడ్డనే ముఖ్యమంత్రి అవుతారని పేర్కొన్నారు. 55 శాతం ఉన్న బీసీలకు 3 మంత్రి పదవులు, కేవలం ఒక్కశాతం ఉన్న కేసీఆర్ వర్గానికి 4 పదవులా అని అడిగారు. హరీష్ రావు పని అయిపోయిందని, ఆరడుగుల బుల్లెట్లో మందు అయిపోయిందని విమర్శించారు. బీజేపీ చెప్పిందే చేస్తుందని, మోసం చేయడం, బీజేపీకి తెలియదన్నారు. ఈ సారి పైసలతో మీ ఓట్లను కొనాలని అధికార పార్టీ చూస్తోందని, అందరూ జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.