»Nara Bhuvaneswari Chandrababu Prioritized Family After People
Nara Bhuvaneswari: ప్రజల తర్వాతే కుటుంబానికి ప్రాధాన్యం ఇచ్చేవారు
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో నిర్వహించిన 'నిజం గెలవాలి' అనే కార్యక్రమంలో నారా భువనేశ్వరి పాల్గొన్నారు. ప్రజల గురించే చంద్రబాబు ఎప్పుడూ ఆలోచించేవారని తెలిపారు.
Nara Bhuvaneswari: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే. ఆయన సతీమణి నారా భువనేశ్వరి తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో నిర్వహించిన ‘నిజం గెలవాలి’ అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. తమ జీవితాల్లో వెలుగులు నింపుతారని చంద్రబాబుపై రాష్ట్ర ప్రజలకు ఎంతో నమ్మకం ఉంది. తన బాధను మహిళలు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. రాజకీయాలు చేసేందుకు ఇక్కడికి రాలేదు. నిజం గెలవాలని చెప్పడానికి వచ్చాను. ఈ పోరాటం తనది మాత్రమే కాదు. ప్రజలందరిదీ. ప్రజలే దేవుళ్లుగా భావించి ఎన్టీఆర్ స్ఫూర్తితో ట్రస్ట్ ఏర్పాటు చేశాం. దీని ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. వేల మంది అనాథ పిల్లలకు చదువు చెప్పిస్తున్నామని తెలిపారు.
చంద్రబాబు ఎప్పుడు ప్రజల గురించే ఆలోచించేవారు. ప్రజల తర్వాతే కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చేవారు. యువతకు ఉద్యోగాలు కల్పించాలని ఎల్లప్పుడూ అనుకునేవారు. రోడ్లు లేని కొండ ప్రాంతంలో హైటెక్ సిటీ ఏంటని అందరు హేళన చేసిన.. పట్టించుకోకుండా పని చేసి లక్షల మంది ఐటీ కుటుంబాల్లో సంతోషం నింపారని భువనేశ్వరి గుర్తుచేశారు. చంద్రబాబుపై కేసులు పెడుతున్నారు. వాటికి ఆధారాలు మాత్రం చూపించడం లేదు. ఇంకా ఎన్ని ఏళ్లు ఈ దారుణాలు. అందరం కలిసి పోరాడుదాం. వైసీపీ పాలనకు అడ్డుకట్టలు వేద్దాం. వీళ్ల పాలనలో మహిళలకు రక్షణ కూడా లేదు, రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి లేదు. ఎక్కడ చూసిన అన్యాయమే అని తెలిపారు. ఎన్నికల వేళ చంద్రబాబును అరెస్ట్ చేస్తే పార్టీ బలహీనం అవుతుందని వైసీపీ నేతలు అనుకుంటారు. కానీ చంద్రబాబు చాలా స్ట్రాంగ్. అతనిని ఏం చేయలేరు. ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది.. నిజమే గెలవాలని ఆమె తెలిపారు.