మెగా 156 అనౌన్స్ చేయకుండా.. డైరెక్ట్‌గా మెగా 157 ప్రకటించినప్పుడే అందరికీ డౌట్ వచ్చింది. కానీ మెగా 156 కూడా ఉంటుందని చెప్పుకొచ్చారు. కాకపోతే డైరెక్టర్ పేరు మాత్రం చెప్పలేదు. కానీ ఇప్పుడు మాత్రం మెగా 157ని 156 చేసేశారు.
నిన్న మొన్నటి వరకు ఇండస్ట్రీ వర్గాల ప్రకారం మెగా 156 కళ్యాణ్ కృష్ణ సినిమా అని ఫిక్స్ అయిపోయారు జనాలు. మెగా 157 సోషియో ఫాంటసీ సినిమా కాబట్టి.. ముందుగానే షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారని వినిపించింది. బింబిసార దర్శకుడు వశిష్ట మెగా 157కు దర్శకత్వం వహిస్తుండగా.. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. అయితే దసరా వరకు మెగా 157 వశిష్టది, మెగా 156 కళ్యాణ్ కృష్ణది అనుకున్నారు. కానీ దసరా రోజు మాత్రం షాకిచ్చే న్యూస్ చెప్పాడు చిరు. మెగా 157నే మెగా 156గా మార్చి అధికారికంగా ప్రకటించారు. దీంతో మెగా 156, 157 అయిందా? లేకుంటే డైరెక్టరే మారిపోయాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కళ్యాణ్ కృష్ణ కథ చిరూకు నచ్చలేదా? లేదంటే మెగా 157తో ఛాన్స్ ఇస్తాడా? అసలు కళ్యాణ్ కృష్ణ పరిస్థితేంటి? అనేదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే.. గతంలో వెంకీ కుడుములను కూడా చాలా రోజులు వెయిట్ చేయించారు మెగాస్టార్. కానీ తీరా ఫైనల్ స్క్రిప్ట్ రెడీ చేశాక నచ్చలేదని చెప్పడంతో.. నితిన్‌తో సినిమాను చేసుకుంటున్నాడు వెంకీ కుడుముల. ఇక ఇప్పుడు కళ్యాణ్ కృష్ణ పరిస్థితి కూడా ఇలాగే ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
నాగార్జునకు సోగ్గాడే చిన్నినాయన, బంగార్రాజు లాంటి హిట్ సినిమాలు అందించిన ఈ డైరెక్టర్.. ఇప్పటికే చిరు కోసం అదిరిపోయే ఫ్యామిలీ ఎంటర్టైనర్ స్క్రిప్ట్ రాస్తున్నాడని వార్తలొచ్చాయి. కానీ ఈయన ప్రాజెక్ట్‌కు సంబంధించిన న్యూస్ బయటికి రాలేదు. మరి మెగాస్టార్ కళ్యాణ్ కృష్ణకు హ్యాండ్ ఇచ్చాడా? లేదంటే.. కొన్నాళ్లు వెయిట్ చేయమని చెప్పాడా? అనే విషయంలో ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి.