తెలంగాణ మంత్రి మల్లారెడ్డి (Minister Mallareddy) గత స్మృతులను గుర్తుచేసుకున్నారు. దసరా సందర్భంగా ఆయుధ పూజ నిర్వహించిన ఆయన 40 ఏళ్ల క్రితం ఉపయోగించిన స్కూటర్(Scooter)ని పూజ చేశారు. అనంతరం ఆ స్కూటరుపై చక్కర్లు కొట్టారు. గతంలో ఇదే స్కూటరుపై తిరుగుతూ బోయినపల్లి (Boinapally) లో పాల వ్యాపారం చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా గతంలో పాలమ్మినా..పూలమ్మి.. కష్టపడ్డానంటూ మల్లారెడ్డి చెప్పిన మాటలను నెటిజన్లు మరోసారి గుర్తుచేసుకుంటున్నారు.
బోయిన్ పల్లిలో విజయదశమి (Vijayadashami) సందర్భంగా మల్లారెడ్డి ఆయుధ పూజ నిర్వహించారు. ఆ సమయంలో తాను యువకుడిగా ఉన్నప్పుడు ఉపయోగించిన స్కూటర్కు సైతం పూజ చేశారు. మంత్రి మల్లారెడ్డి ఎప్పుడూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ (Attraction)గా నిలుస్తూ ఉంటారు. ఎక్కడైనా సరే తన సందడితో అందరినీ ఆకర్షిస్తూ ఉంటారు. ఏ కార్యక్రమంలోనైనా వినూత్నంగా కనిపిస్తూ ప్రజలు, పార్టీ శ్రేణులను అలరిస్తూ ఉంటారు. తన విచిత్ర మాటలు, పనులతో మీడియా(Media)లో ఎక్కుతూ ఉంటారు. తాజాగా మరోసారి మల్లారెడ్డి తన వినూత్నతను చాటుకుని ప్రజలను ఆశ్చర్యపరిచారు,.