»Srileelas Shocking Remuneration For Bhagwant Kesari
Srileela: ‘భగవంత్ కేసరి’ కోసం శ్రీలీల షాకింగ్ రెమ్యూనరేషన్?
ప్రస్తుతం టాలీవుడ్లో శ్రీలీల హవా కొనసాగుతుంది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరి హీరోలతో నటిస్తూ కెరీర్ పరంగా దూసుకెళ్తోంది. తాజాగా ఈ బ్యూటీ నటించిన 'భగవంత్ కేసరి' సినిమాకు భారీ పారితోషిక్ తీసుకుందనే న్యూస్ వైరల్‌గా మారింది.
ప్రస్తుతం టాలీవుడ్ హాట్ కేక్‌గా ఉన్న హీరోయిన్ శ్రీలీల. అమ్మడి చేతిలో ఏకంగా పది ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వచ్చిన ప్రతి ఆఫర్‌ను ఓకే చేసేసింది అమ్మడు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోల సినిమాలతో పాటు యంగ్ హీరోల సరసన కూడా రొమాన్స్ చేస్తోంది. అసలు చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అందరి హీరోలతో రొమాన్స్ చేస్తోంది. ఏకంగా.. గుంటూరు కారం సినిమాలో పూజ హెగ్డేను పక్కకు పెట్టేసి మరీ శ్రీలీలకు మెయిన్ హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చాడు త్రివిక్రమ్. దీంతో అమ్మడికి మరింత డిమాండ్ పెరిగింది.
అందుకే భారీగా డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల స్కంద సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చిన శ్రీలీల.. ప్రజెంట్ థియేటర్లో భగవంత్ కేసరి సినిమాతో అలరిస్తోంది. ఈ సినిమాలో బాలయ్య కూతురు క్యారెక్టర్ చేసింది శ్రీలీల. మామూలుగా అయితే హీరోయిన్ శ్రీలీల కోటిన్నర వరకు తీసుకుంటోందనే టాక్ ఉంది. పెళ్లి సందడి చిత్రానికి చాలా తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న శ్రీలీల.. భగవంత్ కేసరి కోసం ఓ రేంజ్ రెమ్యునరేషన్ అందుకుందట. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం.. ఏకంగా ఒక కోటి 80 లక్షల పారితోషికం అందుకుందట.
ఈ సినిమాలో సీనియర్ బ్యూటీ కాజల్ అగర్వాల్ బాలయ్య సరసన నటించింది. అయినా కూడా కాజల్ కన్నా శ్రీలీలకే ఎక్కువ ఇచ్చారట. కాజల్ ప్రస్తుతం పెద్దగా టైమ్ లైన్లో లేదు కాబట్టి కోటిన్నర ఇచ్చారట. కానీ శ్రీలీల మాత్రం 1.80 కోట్ల పారితోషికం అందుకుందట. ఈ లెక్కన రాబోయే రోజుల్లో అమ్మడు రెండు కోట్లు తీసుకోవడం గ్యారెంటీ. అంతేకాదు రోజు రోజుకి డిమాండ్ పెరుగుతోంది కాబట్టి.. మూడు, నాలుగు కోట్ల వరకు శ్రీలీల పారితోషికం వెళ్లడం గ్యారెంటీ అని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.