»Biden Reach To Israel Pm Grand Welcome To Us President
Israel చేరుకున్న బైడెన్..అందుకోసమేనా?
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(joe Biden) తన సంఘీభావాన్ని తెలియజేయడంతోపాటు ఆయా నాయకులతో యుద్ధ ఆందోళన గురించి చర్చించడానికి ఇజ్రాయెల్ చేరుకున్నారు. బుధవారం టెల్ అవీవ్‌లో దిగిన ఆయనకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఘనస్వాగతం పలికారు.
Biden reach to Israel pm grand welcome to us president
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం 12వ రోజు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అధినేత జో బైడెన్(joe Biden)బుధవారం టెల్ అవీవ్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు(Benjamin Netanyahu)తో చర్చలు జరపబోతున్నారు. హమాస్‌తో యుద్ధంలో దేశానికి తన మద్దతును తెలియజేయడమే కాకుండా బైడెన్ ఇజ్రాయెల్‌ను యుద్ధంలో దెబ్బతిన్న గాజాకు మానవతా సహాయాన్ని పునఃప్రారంభించే అవకాశం ఉంది. ఇటివల గాజా హాస్పిటల్ కాంప్లెక్స్ పై జరిగిన ఘోరమైన పేలుడులో 500 మంది మృత్యువాత చెందారు. అయితే బైడెన్ ప్రస్తుతం ఇజ్రాయెల్‌ను మాత్రమే సందర్శిస్తారని వైట్‌హౌస్ అధికారి ఒకరు తెలిపారు.
గాజాలోని ఆసుపత్రిలో కనీసం 500 మంది మరణించిన పేలుడును ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఈ నెల ప్రారంభంలో ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి “ప్రజల సామూహిక శిక్షను సమర్థించలేదని” పేర్కొన్నారు. దక్షిణ గాజా సమీపంలోని పట్టణాల్లో తీవ్రస్థాయి బాంబు దాడుల మధ్య ఆసుపత్రిలో పేలుడు సంభవించింది. ఈ క్రమంలో గాజాపై ఇజ్రాయెల్ దాడి చేయడం పౌరులను బలవంతంగా బదిలీ చేయడం అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించడమేనని ఐక్యరాజ్యసమితి మంగళవారం పేర్కొంది. “బలవంతంగా బదిలీ” అనే పదం పౌర జనాభా బలవంతపు పునరావాసాన్ని వివరిస్తుందన్నారు.
మరోవైపు గాజా దాడి ఘటనను మంగళవారం సాయంత్రం భారత ప్రధాని నరేంద్ర మోడీ(modi) ఖండిస్తూ Xలో ట్వీట్ చేశారు. “గాజాలోని అల్ అహ్లీ హాస్పిటల్లో జరిగిన విషాదకరమైన ప్రాణనష్టం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు హృదయపూర్వక సానుభూతి వ్యక్తు చేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.