Dasara: ఇటీవల జరిగిన గ్రూప్-4 మెరిట్ జాబితాను దసరా (Dasara) పండుగ తర్వాత విడుదల చేస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సూత్రప్రాయంగా వెల్లడించింది. అభ్యర్థుల మార్కులు, జిల్లా స్థానికత, క్యాటగిరీ తదితర వివరాలు జాబితాలో ఉంటాయి. మహిళల రిజర్వేషన్ గురించి హైకోర్టు స్పష్టత ఇచ్చిన తర్వాత లిస్ట్ ప్రకటిస్తామని చెబుతోంది. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాతం 1:2 నిష్పత్తి ప్రకారం తుది జాబితా ప్రకటించనుంది.
తెలంగాణలో జూలై 1వ తేదీన గ్రూప్-4 (group-4) రాత పరీక్ష జరిగింది. 7.6 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. తర్వాత తుది కీ విడుదల చేశారు. పేపర్-1లో ఏడు, పేపర్-2లో మూడు ప్రశ్నలు తొలగించింది. మరో 13 ప్రశ్నల సమాధానాల్లో మార్పులు చేసింది. తుది కీ విడుదల తర్వాత క్యాండెట్స్ ఆన్సర్ పేపర్స్ వాల్యూయేషన్ చేసింది. మహిళల రిజర్వేషన్, కోడ్ అడ్డంకిగా ఉండటంతో మెరిట్ లిస్ట్ ప్రకటించడం ఆలస్యం అవుతోంది. ఈ రెండింటిపై క్లారిటీ వస్తే మెరిట్ లిస్ట్ విడుదల చేస్తామని చెబుతోంది.
గ్రూప్-1 పరీక్ష లీకేజీతో ఒక్కసారిగా కలకలం రేగింది. మరోసారి పరీక్ష నిర్వహించిన కొందరు హైకోర్టును ఆశ్రయించగా రద్దు చేయాలని ఆదేశాలు జారీచేసింది. దీంతో అభ్యర్థులకు కాంపిటిటివ్ ఎగ్జామ్ రాయాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. గ్రూప్-4 పరీక్ష జరిగినప్పటికీ వివిధ అంశాలు అడ్డంకిగా మారాయి. అందుకే మెరిట్ లిస్ట్ ఆలస్యం అవుతోంది. దానిపై తాజాగా కమిషన్ క్లారిటీ ఇచ్చింది.