Team India Won Match: వరల్డ్ కప్‌లో టీమిండియా (Team India) జైత్రయాత్ర కొనసాగుతోంది. వరసగా మూడో మ్యాచ్‌లో విక్టరీ కొట్టింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ రోహిత్ సేన చిత్తు చేసింది. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న రోహిత్ నిర్ణయాన్ని నిజం చేశారు బౌలర్లు. పాకిస్థాన్ వికెట్ల పతనాన్ని బౌలర్లు శాసించారు. మహ్మద్ సిరాజ్ వికెట్ల వేట మొదలు పెట్టారు. తర్వాత పాండ్యా, కుల్దీప్ యాదవ్ జతకలిశారు. చివరలో బుమ్రా, జడేజా కూడా వికెట్లు తీశారు. ఐదుగురు బౌలర్లు తలో 2 వికెట్లు తీసి.. పాకిస్థాన్‌ను 191 పరుగులకు అలౌట్ చేశారు.
192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మొదటి నుంచి దూకుడుగానే ఆడింది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరోసారి రెచ్చిపోయారు. ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ.. ఈ రోజు మ్యాచ్‌లో కూడా రెచ్చిపోయాడు. కొద్దీలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. 86 పరుగులు చేసి భారత విజయాన్ని శాసించాడు. ఆరు ఫోర్లు, ఆరు సిక్సులతో 86 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ గిల్ ధాటిగా ఆడుతున్నట్టు కనిపించాడు. 16 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. విరాట్ కోహ్లీ కూడా 16 రన్స్ చేసి వెనుదిరిగాడు. 86 పరుగులు చేసి హిట్ మ్యాన్ ఔటయ్యాడు. శ్రేయస్ అయ్యర్ 53 పరుగులు చేసి, కేఎల్ రాహుల్ 19 పరుగులు చేసి భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. 30.3 ఓవర్లలోనే భారత జట్టు లక్ష్యాన్ని ఛేదించింది