ఒకప్పటి రాజకీయాలు వేరు ఇప్పటి రాజకీయాలు వేరు. అప్పట్లో తిట్లను కూడా ఓ పద్దతిలో తిట్టుకునేవారు. కానీ ఇప్పుడు శృతిమించి తిడుతున్నారు. రాజకీయ నేతలు చేసే ఆరోపణలకు ప్రజలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటారు. టీడీపీ (TDP) నేత బండారు సత్యనారాయణ (Bandaru Satyanarayana) విషయంలో కూడా అదే జరిగింది. మంత్రి రోజాపై ఆయన చేసిన ఆరోపణల్లో బ్లూ ఫిల్మ్ అనే పదాన్ని ఉపయోగించడం వల్ల మహిళా నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. అలాంటి ఆరోపణలు చేయడం తప్పని సీనియర్ నటి ఖుష్బూ (Khushboo) ఇప్పటికే తన గళాన్ని వినిపించిన సంగతి తెలిసిందే.
తాజాగా నటి ఖుష్బూ (Khushboo) ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బండారుపై కీలక వ్యాఖ్యలు చేశారు. బ్లూ ఫిల్మ్ ఉందని చెప్పారంటే ఆయన బ్లూ ఫిల్మ్ చూస్తున్నారనే అర్థం అని, అలాంటి దిగజారుడు వ్యక్తి ఒక మహిళను అలా మాట్లాడ్డం సిగ్గుచేటన్నారు. మొత్తంగా ఒక మనిషిగా ఆయన ఓడిపోయారన్నారు. రోజాపై (Minister Roja) బండారు చేసిన వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నానని తెలిపారు.
ఏపీ రాజకీయాల్లోనే (Ap Politics) కాకుండా దేశంలో అన్నిచోట్లా రాజకీయాల్లో మహిళలు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ఖుష్బూ అన్నారు. ఒక మహిళ గురించి అంత అసహ్యంగా మాట్లాడితే తరువాతి తరాల వారికి ఎలాంటి సందేశాలను ఇస్తున్నట్లని ప్రశ్నించారు. మహిళల క్యారెక్టర్‌ను చంపేలా మాట్లాడే హక్కు ఎవ్వరికీ లేదన్నారు. బండారు సత్యనారాయణ వద్ద బ్లూ ఫిల్మ్ ఉందన్నప్పుడు, దమ్ముంటే ఆ వీడియోను రిలీజ్ చేయండని ఖుష్బూ ఫైర్ అయ్యారు. అలా చేయడం పూర్తిగా తప్పని ఖండించారు.