NLR: అనంతసాగరం మండల వ్యవసాయ కార్మిక సంఘం మండల 3వ మహాసభ అనంతసాగరం అతిధి గృహం వద్ద ఆదివారం నిర్వహించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మంగళ పుల్లయ్య మాట్లాడుతూ.. కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టంను నిర్వీర్యం చేయాలని కుట్రలు చేస్తుందని తెలిపారు. ఉపాధి హామీ పనులు చేసిన కూలీలకు బకాయి డబ్బులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.