TG: కాళేశ్వరం పేరుతో ప్రజాధనం వృథా అయ్యిందనే తమ బాధ అని MLA అక్బరుద్దిన్ ఓవైసీ అన్నారు. ‘అనుమతులు లేకుండా ప్రాజెక్టులు ఎందుకు నిర్మిస్తున్నారు?. కాళేశ్వరం గురించి ఇప్పుడు ఏం చేస్తారో చెప్పాలి. కమిషన్ నివేదికను కేబినెట్ భేటీ ద్వారా ప్రభుత్వమే లీక్ చేస్తుందా?. కమిషన్ నివేదిక ఏముందో పత్రికల్లో వచ్చింది.. మాకు మాత్రం తెలియదు. దొంగలకు ఎలా శిక్ష వేస్తారో చెప్పాలి’ అని అన్నారు.