JGL: మల్యాల మండలం కేంద్రంలో బీజేపీ శ్రేణుల ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా భాజపా నాయకులు మాట్లాడుతూ.. శుక్రవారం బీహార్లోని ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రాహుల్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.