Ex Vice President Of India Venkaiah Naidu Make Hot Comments On Politics
Venkaiah Naidu: ప్రస్తుత రాజకీయాలపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) హాట్ కామెంట్స్ చేశారు. చట్టసభలను ప్రతీకారం తీర్చుకునేందుకు వాడుకోవద్దని సూచించారు. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో వెంకయ్య చేసిన కామెంట్స్ చర్చకు దారితీశాయి. చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలని కోరారు. పాలిటిక్స్‌లో ఉన్న మలినాన్ని తొలగించాలని సూచించారు. గుంటూరులో డాక్టర్ కాసరనేని సదాశివరావు శత జయంతి వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. సదాశివరావు జీవిత విశేషాలపై ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. వైద్య, కళా, రాజకీయ రంగాలకు కాసరనేని సదాశివరావు సేవలు చేశారని పేర్కొన్నారు. సాధారణ కుటుంబంలో జన్మించి.. ఉన్నత స్థాయికి ఎదిగిన ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోందని తెలిపారు.
కులం, డబ్బుతో క్రిమినల్స్ రాజకీయాల్లో ఉన్నారని మండిపడ్డారు. బూతులు మాట్లాడే వారికి ఓటుతో సమాధానం చెప్పాలని ఓటర్లకు సూచించారు. కులం కాదు.. గుణం చూసి ఓటు వేయాలని అంటున్నారు. రాజకీయ నేతల తీరు సిగ్గు అనిపిస్తోందని వెంకయ్య అన్నారు. ఏమీ చేయలేం అనుకోవద్దని.. అందరం కలిస్తే జరుగుతోందన్నారు. కులం పేరుతో రెచ్చగొట్టే రాజకీయ నేతలకు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. గుణమంతులను ఎన్నుకుంటే.. మంచి పనులు చేస్తారు.. మంచి జరుగుతుందన్నారు.