Israel vs Hamas: ప్రాణభయంతో పరుగులు తీసిన బ్రిటన్ మంత్రి
కొన్ని రోజులుగా హమాస్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధంలో చాలామంది గాయపడటంతో పాటు చనిపోయారు. గాయపడిన వారికి అండగా ఉండేందుకు బ్రిటన్ మంత్రి ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లారు. ఆ క్రమంలో అతనికి ఓ భయానక సంఘటన ఎదురైంది.
James Cleverly: హమాస్-ఇజ్రాయెల్ మధ్య మొదలైన పోరులో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఏం నిమిషానికి ఏం జరుగుతుందోనని ఇప్పటికీ చాలామంది ప్రాణభయంతో జీవిస్తున్నారు. ఇలాంటి భీకర యుద్ధ సమయంలో బ్రిటన్ విదేశాంగ మంత్రి జేమ్స్ క్లెవర్లీ ఇజ్రాయెల్‌కు అండగా ఉండేందుకు పర్యటనకు వెళ్లారు. హమాస్ దాడుల్లో గాయపడిన వారిని కలిసేందుకు వెళ్లి..ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్నారు. ఇలా అక్కడ నేతలతో కూడా భేటీ అయ్యారు. ఇంతలోనే అక్కడ రాకెట్ దాడి జరగనుందని హెచ్చరిస్తూ ఒక సైరన్ మోగింది.
Watch: while UK FM @JamesCleverly visits Ofakim in southern Israel, a siren goes off warning of incoming Hamas rocket fire.
సైరెన్ మోగిన వెంటనే గాజా నుంచి ఇజ్రాయెల్ వైపుగా ఒక రాకెట్ దూసుకొచ్చింది. వెంటనే జేమ్స్ ప్రాణభయంతో పరుగుల తీయగా.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హమాస్ నుంచి రాకెట్ రావడంతోనే జేమ్స్ పరుగులు పెట్టారని ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ ఈ ఘటనపై వివరణ ఇచ్చింది. ఈ సంఘటనపై జేమ్స్ తన అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ క్రమంలో ప్రతి రోజూ ఇజ్రాయెల్‌లో ఎన్నో లక్షల మంది వాళ్ల ప్రాణాలు కోల్పోతున్నారు. తాను కూడా ఈ రోజు ప్రత్యక్షంగా ఇలాంటి సంఘటనను అనుభవించానని పేర్కొన్నారు. అందుకే ఇజ్రాయెల్‌కు పూర్తి అండగా ఉన్నానని తెలిపారు.