»Bubblegum Teaser Roshan Kanakala Maanasa Choudhary Ravikanth Perepu People Media Factory
BubblegumTeaser: కొడుకు లిప్ లాక్ పై స్పందించిన రాజీవ్ కనకాల
బబుల్గమ్ టీజర్ విడుదలైంది. దీనిలో లాస్ట్ షాట్లో హీరోహీరోయిన్ల ముద్దు సీన్ ఉంది. దీనిపై హీరో తండ్రి రాజీవ్ కనకాల స్పందించడం ప్రస్తుతం పలువురిని ఆశ్చర్యపోయేలా చేసింది. ఎలా స్పందించారో మీరే చూసేయండి మరి.
Bubblegum Teaser Roshan Kanakala Maanasa Choudhary Ravikanth Perepu People Media Factory
Bubblegum Teaser: ప్రస్తుతం వస్తున్న సినిమా కంటెంట్లో బూతులు, లిప్లాక సీన్లు అంతకు మించిని సన్నివేశాలు చాలా మాములు వ్యవహారం అయిపోయాయి. విడుదలైన పది సినిమాల్లో 8 ఇంటిలో మినిమమ్ హాట్ సీన్లు ఉంటున్నాయి. నేటి తరం కూడా ఇదే కోరుకుంటున్నారు. తాజాగా బబుల్గుమ్ టీజర్(Bubblegum Teaser) విడుదలైంది. ప్రముఖ యాక్టర్ రాజీవ్ కనకాల(Rajeev Kanakala), యాంకర్ సుమ(Suma) దంపతుల కొడుకు రోషన్ కనకాల(Roshan Kanakala ) హీరోగా, మానస చౌదరీ(Maanasa Choudhary) హీరోయిన్గా నటిస్తున్న చిత్రం బబుల్గుమ్. ఈరోజు సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ జరుపుకుంది.
ఈ వేడుకలో రాజీవ్ కనకాల ఈ సినిమా గురించి మాట్లాడారు. హీరోగా తన కొడుకు బాగానే చేసి ఉంటాడని టీజర్ చూస్తే అర్థం అవుతుందని అన్నారు. అలాగే టీజర్ లాస్ట్ లో వచ్చే సీన్ చూస్తేనే అర్థం అవుతుందని.. అక్కడితే చిన్నగా నవ్వడం మొదలు పెట్టాడు. అంతలో యాంకర్ సుమ కలుగజేసుకుని కొన్నింటి గురించి మనం మాట్లాడకపోవడమే మంచిది రాజీవ్ అంటూ చెప్పుకొచ్చింది. మొత్తానికి ఈ సంభాషణ ఫన్నీగానే ఉన్నా..తల్లిదండ్రలు తమ పిల్లల గురించి అలా మాట్లాడటం కొంత ఎబ్బట్టుగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే దీనిపై మీ స్పందన ఏంటో తెలియజేయండి మరి.