శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్లో ఇండియన్ 2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా డబ్బింగ్ పనులు స్టార్ట్ చేసి షాక్ ఇచ్చాడు శంకర్. దీంతో రామ్ చరణ్ గేమ్ చేంజర్ పరిస్థితేంటనేది.. ఎటు తేల్చుకోలేకపోతున్నారు అభిమానులు.
‘game changer’: పాన్ ఇండియా సినిమా లేని రోజుల్లోనే ఆ రేంజ్ సినిమాలు చేసిన శంకర్.. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ సోలోగానే మొదలైనప్పటికీ.. మధ్యలో ఇండియన్ 2 రావడంతో స్లో అయిపోయింది. తప్పని పరిస్థితుల్లో శంకర్ రెండు సినిమాలను బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నారు. గేమ్ చేంజర్ నుంచి ఎలాంటి అప్డేట్స్ బయటికి రావడం లేదు. ఇండియన్-2 మాత్రం జెట్ స్పీడ్‌లో దూసుకుపోతోంది. తాజాగా ఈ సినిమాకు డబ్బింగ్ పనులు స్టార్ట్ అయ్యాయి. అందుకు సంబంధించిన వీడియో కూడా రిలీజ్ చేశారు.
కమల్, శంకర్ డబ్బింగ్ స్టూడియోలోకి వెళ్లడం, వారిద్దరూ ముచ్చటించడం లాంటివి ఈ వీడియోలో చూపించారు. ఇదే ఇప్పుడు గేమ్ చేంజర్‌కు షాక్ ఇచ్చేలా ఉంది. ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ప్రారంభమైందని.. గచ్చిబౌలి, వికారాబాద్ లాంటి ప్రాంతాల్లో షూట్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. సడెన్‌గా ఇండియన్ 2 డబ్బింగ్ స్టూడియోలో ప్రత్యక్షమయ్యాడు శంకర్. మరి శంకర్ అక్కడ ఉంటే.. గేమ్ ఛేంజర్ షూటింగ్ ఎవరు చేస్తున్నారు? శంకర్ లేకుండానే షూట్ చేస్తున్నారా? లేదంటే ఇండియన్ 2 నుంచి విడుదలైన డబ్బింగ్ థియేటర్ వీడియో పాతదా? అనే డౌట్స్ మొదలయ్యాయి.
ఇది నిజంగా ఓల్డ్ వీడియో అయితే ఓకే.. శంకర్ లేకుండా గేమ్ చేంజర్ షూటింగ్ జరిగితే మాత్రం.. ఇది మెగా ఫ్యాన్స్‌కు డిసప్పాయింట్ చేసే వార్తనే. ఎందుకంటే.. శంకర్ లేకుండా చరణ్‌పై సన్నివేశాలను చిత్రీకరించడం, సినిమా ఔట్‌పుట్‌పై అనుమానాలకు ఛాన్స్ ఇస్తోంది. అసలే ఈ సినిమా డిలే అవుతుంది.. అలాంటప్పుడు శంకర్ లేకుండా షూటింగ్ అంటే.. ఎలా అని బాధపడుతున్నారు మెగాభిమానులు. మరి గేమ్ చేంజర్ పై శంకర్ ఎప్పుడు క్లారిటీ ఇస్తాడో చూడాలి.