»Is This What Friendship Is Unable To Bear The Death Of A Friend He Commits Suicide
Mancherial: స్నేహమంటే ఇదేరా..ఫ్రెండ్ మరణం తట్టుకోలేక ఆత్మహత్య
ఇద్దరు ప్రాణ స్నేహితులు ప్రాణాలొదిరారు. ఫ్రెండ్‌తో కలిసి ఉండలేనని మనస్థాపం చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రాణ స్నేహితుడు ఆత్మహత్య చేసుకోవడంతో మరో వ్యక్తి గోదావరిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో వారి గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
తన స్నేహితుడి ఆత్మహత్య తట్టుకోలేక ఓ వ్యక్తి తాను కూడా ప్రాణాలొదిలాడు. గోదావరిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు వివరాల మేరకు..శ్రీరాంపూర్ ఆర్కే 8వ కాలనీలో సందిపనేని మోహన్, అఖిల్ ఇద్దరూ ప్రాణమిత్రులు. ఇద్దరూ కలిసే చదువుకున్నా ఎప్పుడూ దూరంగా మాత్రం ఉండలేదు. ఒకరంటే మరొకరికి ప్రాణం అనేలా బతికారు.
ఈ నేపథ్యంలో అఖిల్‌కు నాలుగు నెలల కింద మంచిర్యాలకు చెందిన ఓ యువతితో వివాహమైంది. అయినా కూడా వారి మధ్య స్నేహం తగ్గలేదు. ఇద్దరూ కలిగే తిరుగుతూ ఉండేవారు. దీంతో అఖిల్ భార్యకు, కుటుంబ సభ్యులకు వారి స్నేహం నచ్చలేదు. అఖిల్ దంపతుల మధ్య పలుమార్లు గొడవలు కూడా జరిగాయి. పెళ్లి వల్ల తమ స్నేహం వదులుకోవాల్సి వస్తోందని మనస్థాపం చెంది సోమవారం ఇంట్లో బలవన్మరణానికి పాల్పడ్డాడు.
అఖిల్ మరణాన్ని తట్టుకోలేని మోహన్తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలో గోదావరిలో దూకి చనిపోతున్నానంటూ కుటుంబీకులకు ఫోన్ ద్వారా తెలిపాడు. గురువారం మధ్యాహ్నం పోలీసులు గోదావరి దిలో మోహన్ డెడ్ బాడీని గుర్తించారు. ఇద్దరు ప్రాణ స్నేహితులు చనిపోవడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.