»Made To Clean Toilets Maharashtra Hospital Dean Now Faces Police Case
Viral News: 72 గంటల్లో 31 మంది మృతి..ఆస్పత్రి డీన్‌పై పోలీస్ కేసు
వైద్యుల నిర్లక్ష్యం కారణంగా కేవలం 72 గంటల్లోనే 31 మంది ప్రాణాలు కోల్పొయారు. అందులో 16 మంది నవజాతి శిశువులే ఉన్నారు. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆసుపత్రి డీన్‌ను విచారిస్తున్నారు.
Made To Clean Toilets, Maharashtra Hospital Dean Now Faces Police Case
Viral News: మహారాష్ట్రలో(Maharashtra)ని నాందేడ్ ప్రాంతంలో ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో 72 గంటల్లో 31 మంది మరణాలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఆసుపత్రి డీన్‌తో పాటు మరో డాక్టర్ పై బాధితులు కేసు నమోదు చేశారు. ఆసుపత్రిలో మరణించిన నవజాత శిశువు బంధువు ఫిర్యాదు మేరకు నాందేడ్ రూరల్ పోలీసులు డీన్ డాక్టర్ ఎస్ ఆర్ వాకోడ్, మరో వైద్యుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారిస్తున్నారు. హస్పటల్లో డీన్, చైల్డ్ స్పెషలిస్ట్ నిర్లక్ష్యం వల్లే నవజాత శిశువు చనిపోయిందని ఫిర్యాదుదారుడు ఆరోపించారు. శిశువు బాగలేదని వైద్యులను సంప్రదిస్తే మందులు రాశారని, వాటిని తీసుకుని ఎంత సేపు ఎదురుచూసినా డాక్టర్ రాలేదని, అదే సమయంలో డీన్‌ను కలిసినా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని ఆరోపించారు. ఈ ఘటన బుధవారం జరగగా అంతకు ముందు రోజు డీన్ ఆసుపత్రిలో టాయిలేట్స్ క్లీన్ చేయిస్తున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది.
72 గంటల్లో 31 మరణాలతో వార్తల్లో నిలిచిన డాక్టర్ శంకర్రావ్ చవాన్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిని నాందేడ్‌లోని లోక్‌సభ ఎంపీ హేమంత్ పాటిల్ మంగళవారం సందర్శించారు. మృతుల్లో 16 మంది చిన్నారులు ఉన్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఆస్పత్రిలో మరుగుదొడ్ల దుస్థితిని చూసి బాధగా ఉందన్నారు. ప్రభుత్వం కోట్లు ఖర్చు చేస్తుంది. కానీ ఇక్కడ పరిస్థితిని చూసి బాధపడ్డానని అన్నారు.
చాలా టాయిలేట్స్కు తాళాలు వేసి ఉన్నాయని, తాగునీటి సౌకర్యం కూడా సరిగ్గా లేదన్నారు. దీంతో అప్రమత్తం అయిన ఆసుపత్రి డీన్, ఎంపీ ఆదేశాల మేరకు ఆసుపత్రి టాయిలెట్లను శుభ్రం చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. అలాగే ఆసుపత్రి ఆవరణలో పందులు సంచరిస్తున్న దృశ్యాలు కనిపించడంతో డీన్‌పై నెటిజన్లు విరుచుకుపడ్డారు. ప్రస్తుతం ఆధికారులు వీరిని విచారిస్తున్నారు. వీరు కావాలనే నిర్లక్ష్యం వహించినట్లు తేలితే శిక్ష మరింత పడే అవకాశం ఉంటుంది.