ఈ వారం రెండు సినిమాలు థియేటర్లోకి వచ్చాయి. ఒకటి ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన 'స్కంద'.. ఇంకోటి క్లాస్ డైరెక్టర్ తీసిన మాస్ మూవీ 'పెదకాపు 1'. ఈ రెండు సినిమాలు కూడా మాస్ ఆడియెన్స్ టార్గెట్‌గా వచ్చాయి. అందుకే.. ఓ విషయంలో అది అవసరమా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Skanda: బాలయ్యని సింహ, లెజెండ్, అఖండగా చూపించి సాలిడ్ హిట్స్ కొట్టిన బోయపాటి.. ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని ఊరమాస్‌గా ప్రజెంట్ చేశాడు. థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో స్కంద థియేటర్లు మోతమోగిపోతున్నాయి. రియాల్టీకి దగ్గరగా లేకుండా ఉంది ఈ సినిమా. పైగా రామ్ చేసిన ఊచకోత మామూలుగా లేదు. తమన్ బాదుడుకు చెవులు చిల్లులు పడుతున్నాయి. మొత్తంగా బోయపాటి మాస్ డైరెక్టర్ కాబట్టి.. లాజిక్స్ లేకుండా సినిమా చూస్తే బెటర్ అనే టాక్ సొంతం చేసుకుంది. కానీ ఈ సినిమాకు సీక్వెల్ కూడా అనౌన్స్ చేశాడు బోయపాటి. క్లైమాక్స్‌లో రామ్ డ్యూయెల్ రోల్ అని సర్ప్రైజ్ చేసి.. సెకండ్ పార్ట్ ఉంటుందని ఫిక్స్ చేశాడు. ఇలాంటి సినిమాకు సీక్వెల్ అవసరమా? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. పైగా బోయపాటి అఖండ 2 కమిట్ అయి ఉన్నాడు. ఆ సినిమా అయిపోయిన తర్వాతే.. స్కంద 2 ఉంటుంది. అప్పటి వరకు ఇలాంటి మాస్ సినిమాను చూడడమంటే కష్టమనే అంటున్నారు.
శ్రీకాంత్ అడ్డాల విరాట్ కర్ణను హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ.. పెదకాపుని ముందే రెండు భాగాలని ప్రకటించాడు. ఇప్పుడు రిలీజ్ అయింది పార్ట్ వన్. ఈ సినిమా కూడా ఊరమాస్‌గా ఉందని అంటున్నారు. ఇది ఒక రా అండ్ రస్టిక్ పొలిటికల్ డ్రామా.. మితిమీరిన హింసను భరిస్తే తప్పా ఈ సినిమాను చూడలేమనే టాక్ సొంతం చేసుకుంది. పెదకాపు 2 అవసరమా అనే చర్చ జరుగుతోంది. ఇలాంటి మాస్ సినిమాలు బీ, సీ సెంటర్లలో వర్కౌట్ అయినా.. ఫైనల్ రిజల్ట్ తేడాగా ఉంటుందనే టాక్ ఉంది. కాబట్టి.. ఈ రెండు సినిమాల సీక్వెల్స్ ఉంటాయా? లేదో చూడాలి.