»Old Man Holding Lt Ultratech Shares Worth Rs 100 Crore
Old Man మాములోడు కాదు.. షేర్ వ్యాల్యూ రూ.100 కోట్లు
కర్ణాటకకు చెందిన ముసలాయనకు షేర్ల రూపంలో రూ.100 కోట్లకు పైగా నగదు షేర్ల రూపంలో ఉంది. వాటి ద్వారా ఏడాదికి రూ.6.50 లక్షల డివిడెంట్లను కూడా పొందుతున్నానని చెబుతున్నారు.
Old Man Holding L&T, UltraTech Shares Worth Rs 100 Crore
Old Man : కర్ణాటకకు చెందిన ముసలాయన.. చాలా సింపుల్‌గా ఉంటున్నారు. పాత ఇల్లు.. ఇంటి ముందు చిన్న కారుతో అలా గడిపేస్తున్నారు. ఒంటిపై కనీసం బనియన్ కూడా వేసుకోలేదు. జంధ్యం ధరించి ఉన్నారు. అతనిని స్థానిక మీడియా ప్రతినిధి ఇంటర్వ్యూ చేశారు. అతని లైఫ్ గురించి అడుగుతుండగా.. అనూహ్యంగా స్టాక్ మార్కెట్లలో షేర్ల గురించి ప్రస్తావన ఇచ్చింది. తనకు ఇంత మొత్తంలో షేర్లు ఉన్నాయని చెబితే.. ఆ రిపోర్టర్ నోరెళ్ల బెట్టారు. ఇంత డబ్బు ఉండి.. ఎందుకు ఇలా ఉంటున్నారని అడిగితే చిరునవ్వు నవ్వేశాడు పెద్దాయన. అప్పు చేసి.. ఫోజులు కొట్టే కొందరికీ అతను ఆదర్శంగా నిలిచాడు.
స్టాక్ మార్కెట్లో తనకు ఉన్న షేర్ల గురించి అతను వివరించాడు. అత్యధికంగా ఎల్ అండ్ టీ కంపెనీలో రూ.80 కోట్ల విలువైన షేర్లను కలిగి ఉన్నాడట.. తర్వాతి స్థానం మాత్రం అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీకి చెందుతుంది. ఇందులో రూ.21 కోట్ల విలువ గల షేర్లు, దాంతోపాటు కర్ణాటక బ్యాంకులో రూ.కోటి విలువైన షేర్లను కలిగి ఉన్నాడట. అంటే మొత్తం రూ.102 కోట్ల షేర్లను ఆ వృద్దుడు కలిగి ఉన్నాడు. ఇంటి వద్ద ఉంటూ.. చక్కగా గడిపేస్తున్నారు. ఈ షేర్ల ద్వారా ఏడాదికి రూ.6.50 లక్షలు డివిడెండ్ రూపంలో వస్తున్నాయని నవ్వుతూ చెప్పాడు. డివిడెంట్ అంటే.. ఓ కంపెనీ లాభంలో కొంతభాగం వాటాదారులకు చెల్లిస్తోంది. ముసలాయన ఇంటి వద్ద ఉండగా రూ.6.50 లక్షల మొత్తం అందుతున్నాయి.
ఆ వృద్దుడి వీడియోను రాజీవ్ మొహతా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఈ వ్యక్తిని చూడాలని.. అతని కొట్టే స్టైల్ ఎంత మాత్రం కాదని ఒకరు, సింప్లిసిటీకి బాప్ అని మరొకరు రాసుకొచ్చారు. ఒక్కొక్కరు రూ. కోటి ఉంటేనే ఆగరు.. అతను రూ.100 కోట్లు ఉన్నా.. సింపుల్‌గా ఉన్నారని మరొకరు రాశారు. ఆ వృద్దుడు మాత్రం మిగతా చాలా మందికి ఆదర్శంగా నిలిచాడు. డబ్బు ఉంటే ఖర్చు పెట్టడం కాదు.. ఆదా చేయడం, పొదుపు చేయడం అనే జీవిత సత్యాన్ని నిరూపించాడు.