Pawan Kalyan: 5 రోజులు మాత్రమే ఇచ్చిన పవర్ స్టార్!
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ పనులతో పాటు.. సినిమా పనులు కూడా చేస్తున్నాడు. తాజాగా సినిమా షూటింగ్ కోసం మళ్లీ డేట్స్ కేటాయించాడు. కానీ కేవలం అయిదు రోజులు మాత్రమే ఇచ్చాడట.
Pawan Kalyan:పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అందుకే కాంబినేషన్‌ని రిపీట్ చేస్తూ పదకొండేళ్ల తర్వాత ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే సినిమా రాబోతోంది. ఇప్పటికే ఈ మూవీ దాదాపు 50% షూటింగ్ కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది. హరీష్ శంకర్ ఎప్పుడు? ఎలా? షూటింగ్ చేశాడో తెలియదు గానీ.. ఉస్తాద్ పై మాత్రం భారీ అంచనాలున్నాయి. తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ లేటెస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. రాజకీయంగా బిజీగా ఉన్న పవన్ ఓ అయిదు రోజుల పాటు డేట్స్ ఇచ్చాడట.
అక్టోబర్ 1 నుంచి పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో పాల్గొననున్నాడు. ఈ లోపు ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ చెయనున్నాడట. ఈ చిన్న షెడ్యూల్లో పవన్ కళ్యాణ్ పై కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ షూట్ చేయనున్నాడట హరీష్ శంకర్. ఇక ఆ తర్వాత మళ్లీ పవన్ ఎప్పుడు డేట్స్ ఇస్తాడో ఎవ్వరికీ తెలియదు. కాబట్టి కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ఇప్పటికే రిలీజ్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. పవన్ ఫ్యాన్స్ అంతా.. హరీష్ శంకర్ మరోసారి గబ్బర్ సింగ్ లాంటి హిట్ ఇస్తాడనే నమ్మకంతో ఉన్నారు. ఇది వచ్చే ఎన్నికలే టార్గెట్‌గా ఈ సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. తమిళ్ హిట్ మూవీ ‘తేరీ’ రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీలీల నటిస్తోంది. సెకండ్ హీరోయిన్గా సాక్షి వైద్య నటిస్తున్నట్టు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.