అర్మేనియా (Armenia)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. గ్యాస్ స్టేషన్లో పేలుడు (fuel depot blast ) సంభవించడంతో సుమారు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో 300 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడినవారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందస్తున్నారు. వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటన నాగర్నో-కారాబఖ్ ప్రాంతంలో జరిగింది.
అర్మేనియా సైనికుల (Armenian Forces)పై అజర్బైజాన్ సైన్యం (Azerbaijan Military) గత కొన్ని రోజులుగా దాడులు చేస్తోంది. ఆ ప్రాంతంలో ఆర్మేనియా-అజర్బైజాన్ సైన్యం మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో వేలాది మంది ప్రజలు ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోతున్నారు. దీంతో ఆ ప్రాంత రహదారులన్నీ కూడా రద్దీగా మారాయి.
ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడంతో ఇప్పటి వరకూ 20 మంది ప్రాణాలు విడిచారు. ఇందులో 300 మంది గాయాలపాలయ్యారు. ఇప్పటి వరకూ నగర్నో, కరాబఖ్ నివాసితులు 6500 మంది వరకూ ఆర్మేనియాకి తరలి వెళ్లిపోయారు.