WorldEnvironmentHealthDay: ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు
మన ఆరోగ్యానికి పర్యావరణానికి వీడదీయలేని సంబంధం ఉంటుంది. మన చుట్టు ఉన్న పర్యావరణం పట్ల నిర్లక్ష్యం వహించి ప్రవర్తిస్తే దాని వల్ల మానవాళికే నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అయితే నేడు(సెప్టెంబర్ 26) ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కొన్ని విషాయాలను ఇక్కడ చుద్దాం.
మనకు పర్యావరణానికి దగ్గరి సంబంధం ఉంటుంది. మన చుట్టు ఉన్న పర్యావరణం సురక్షితంగా ఉంటేనే మనం కుడా ఆరోగ్యంగా ఉంటాము. లేదంటే అనేక రకాల వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో పర్యావరణాన్ని రక్షించుకోవడం మనందరి బాధ్యత. అయితే ఈరోజు (సెప్టెంబర్ 26) ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవం(World Environment Health Day) సందర్భంగా దీని ప్రాముఖ్యత, విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం, పర్యావరణ సమస్యలు, పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 26న ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ రోజు మన మొత్తం ఆరోగ్యం, శ్రేయస్సుపై పర్యావరణ ప్రభావం కూడా ఉంటుందని అవగాహన కల్పించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్నారు.
మానవజాతి సంక్షేమం కోసం పర్యావరణ సంరక్షణ మార్గాలను ప్రోత్సహించడానికి ఇది ఏర్పాటు చేయబడింది. ప్రకృతి, పర్యావరణాన్ని రక్షించడానికి సులభమైన మార్గాల గురించి ప్రజలకు తెలియజేయడానికి వివిధ ప్రచారాల ద్వారా అవగాహన కల్పించనున్నారు. నేటి బిజీ లైఫ్లో ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ప్రజలు ప్రయోజనాల కోసం సహజ వనరులను నిరంతరం దోపిడీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పర్యావరణ ఆరోగ్యం క్రమంగా క్షిణించి ప్రజలు(people) వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. ఇలాంటి క్రమంలో మానవజాతి సురక్షితమైన భవిష్యత్తు కోసం ప్రజలు పర్యావరణాన్ని సంరక్షించాలని కోరుతున్నారు.
ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవం 2023: థీమ్
ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవం థీమ్ “గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ పబ్లిక్ హెల్త్: స్టాండింగ్ అప్ టు ప్రొటెక్ట్ ఎవ్రీ అండ్ ఎవ్రీ డే.”
బావి ఎండిపోయే వరకు నీటి విలువ మనకు తెలియదు
– థామస్ ఫుల్లర్
ప్రజలు మనం ఉపయోగించగలిగే వస్తువులను విసిరేయడాన్ని నేను చూసినప్పుడు. వ్యర్థాలను చూస్తేనే కోపం వస్తుంది.
– మదర్ థెరిస్సా
భూమి మనందరికీ ఉమ్మడిగా ఉంటుంది..జాగ్రత్తగా కాపాడుకుందాం