Bigg Boss7: బిగ్ బాస్ 7 (Bigg Boss7) అప్పుడే మూడో వారం ముగుస్తోంది. ఎలిమినేషన్లో ఉన్న కంటెస్టెంట్లలో శనివారం ఎపిసోడ్లో ఒక్క యావర్ మాత్రమే సేఫ్ అయ్యాడు. ఆదివారం ఎపిసోడ్లో మిగతావారు సేఫ్ అవనుండగా.. ఒకరు హౌస్ నుంచి బయటకు వస్తారు. ఈ సీజన్ కాస్తా ఉత్సాహంగానే సాగుతోంది. హౌస్‌లో శివాజీని (shivaji) కంటెస్టెంట్లు పెద్ద దిక్కుగా చూస్తున్నారు. ఇదే విషయం నాగార్జున శివాజీతో చెప్పారు. దానిని తీసుకోవాలని కోరారు.. సరే బాబు గారూ అని శివాజీ సమాధానం ఇచ్చారు.
మూడో హౌస్ మేట్‌గా శోభా శెట్టి నిన్నటి ఎపిసోడ్లో కన్ఫామ్ అయ్యింది. గేమ్ ఛేంజర్ ఎవరు..? సేఫ్ ప్లేయర్ ఎవరు అని టాస్క్ ఇచ్చాడు. గేమ్ చేంజర్‌గా యావర్ నిలిచాడు. అతనికి నాలుగు బ్యాడ్జీలు వచ్చాయి. ఇక సేఫ్ ప్లేయర్‌గా టేస్టీ తేజకు వచ్చింది. అందరికంటే సేఫ్ గేమ్ ఆడుతున్నాడని కంటెస్టెంట్లు తెలిపారు. వారం రోజులు గిన్నెలు వాష్ చేయాలని టాస్క్ ఇచ్చాడు నాగార్జున.
సంచాలకుడు సందీప్‌కు మంచి క్లాస్ ఇచ్చాడు నాగార్జున. సంచాలకుడిగా ఫెయిల్ అయ్యావని ఫైర్ అయ్యాడు. ప్రియాంక, శోభా శెట్టి, ప్రిన్స్ యావర్‌లో వీకెస్ట్ కంటెస్టెంట్‌ను పక్కన పెట్టాలని బిగ్ బాస్ చెబితే స్ట్రాంగ్ కంటెస్టెంట్ యావర్‌ను అనర్హుడిగా ప్రకటించడం ఏంటి అని మండిపడ్డారు. ఇదే అంశంపై సందీప్‌ను జైలుకు పంపాలా..? బ్యాటరీ లైఫ్ తగ్గించాలా అని అడిగారు. జైలుకు పంపాలని కోరగా.. నాగార్జున సందీప్ బ్యాటరీ డౌన్ చేయించారు.
అమర్ దీప్‌ను కూడా వదల్లేదు నాగార్జున. నిన్ను నువ్ ఎందుకు డిఫెండ్ చేసుకోవడం లేదని అడిగారు. నీ కోసం ఆడుతున్నావా..? లేదంటే ప్రియాంకను గెలిపించేందుకు ఆడుతున్నావా అని అడిగారు. ప్రశాంత్ అనర్హుడు అంటే బాగా సీరియస్ అయ్యాయని.. ప్రియాంకను ఎందుకు అనలేదని అడిగారు. శివాజీ పవర్ అస్త్ర దొంగతనం చేసి జోకర్ అయ్యావని అన్నారు. హౌస్‌లో ఉన్నవా అని రతిక మీద ఫైర్ అయ్యాడు. పాత ఘటనల గురించి ఆలోచిస్తున్నానని చెప్పగా.. వాటి గురించి ఆలోచిస్తే ప్రస్తుతంలో బతకలేవని, భవిష్యత్ కూడా బాగుండదు అని చెప్పేశాడు. ఈ రోజు ఎపిసోడ్లో ఒకరు ఎలిమినేట్ అవుతారు.