»Another Company For Telangana Rs 350 Crore Investment 1000 Jobs
Telangana: తెలంగాణకు మరో కంపెనీ..రూ.350 కోట్ల పెట్టుబడి, 1000 మందికి ఉద్యోగాలు
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు మరో కంపెనీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింటెక్స్ కంపెనీ రాష్ట్రంలో రూ.350 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా మరో 1000 మందికి ఉద్యోగాలు రానున్నాయి.
తెలంగాణకు వరుసగా కంపెనీలు క్యూకడుతున్నాయి. ఇప్పటికే భారీగా పెట్టుబడులు రావడంతో నిరుద్యోగులు, ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. తాజాగా మరో కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. సింటెక్స్ కంపెనీ రూ.350 కోట్ల పెట్టుబడిని పెట్టేందుకు సిద్ధమైంది. వెల్ప్‌న్ గ్రూప్ కంపెనీ భాగాస్వామిగా సింటెక్స్ కంపెనీ కొనసాగనుంది. రాష్ట్రంలో రూ.350 కోట్ల తయారీ యూనిట్‌ను నెలకొల్పనున్నట్లు తెలిపింది.
రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఈ సందర్భంగా కంపెనీ పెట్టుబడుల గురించి కీలక విషయాలను వెల్లడించారు. ఈ కంపెనీ వస్తే దాదాపు 1000 మందికి పైగా ఉద్యోగాలు లభించనున్నాయన్నారు. రంగారెడ్డి జిల్లా చందన్వెల్లిలో ఈ సింటెక్స్ తయారీ యూనిట్‌ను నెలకొల్పబోతున్నట్లు తెలిపారు.
అందులో సింటెక్స్ వాటర్ ట్యాంకులను, ప్లాస్టిక్ పైపులను, ఆటో కాంపోనెంట్స్ తదితర ఉత్పత్తులను తయారు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 28వ తేదిన ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఇంకా చాలా కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రానున్నాయని మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు.