»Sachin Tendulkar Sunil Gavaskar And Kapil Dev Offered Prayers At Kashi Vishwanath Temple In Varanasi
Varanasi Cricket Stadium: వారణాసిలో దిగ్గజ క్రికెటర్లు.. అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి శంకుస్థాపన
వారణాసిలో గొప్ప క్రికెట్ స్టార్ల జాతర జరిగింది. సచిన్, గవాస్కర్, కపిల్, విశ్వనాథ్, వెంగ్సర్కార్ వంటి ప్రముఖులంతా ఒకే నగరంలో ఉన్నారు. వీరంతా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం శంకుస్థాపన నిమిత్తం వచ్చారు.
Varanasi Cricket Stadium: వారణాసిలో గొప్ప క్రికెట్ స్టార్ల జాతర జరిగింది. సచిన్, గవాస్కర్, కపిల్, విశ్వనాథ్, వెంగ్సర్కార్ వంటి ప్రముఖులంతా ఒకే నగరంలో ఉన్నారు. వీరంతా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం శంకుస్థాపన నిమిత్తం వచ్చారు. 30 ఎకరాల్లో నిర్మించనున్న అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. భారత క్రికెట్లోని 10 మంది దిగ్గజాలు వారణాసికి చేరుకున్నారు. చాలా కాలం తర్వాత దిగ్గజాలన్ని వారణాసికి రావడంతో అక్కడ కాశీ విశ్వనాథుడిని సందర్శించుకున్నారు.
#WATCH | Uttar Pradesh: Former Indian cricketers Sachin Tendulkar Sunil Gavaskar and Kapil Dev, BCCI Secretary Jay Shah, Rajeev Shukla, BCCI Vice-President, offered prayers at Kashi Vishwanath temple in Varanasi
స్టేడియం శంకుస్థాపన సందర్భంగా వారణాసికి చేరుకున్న క్రికెటర్లంతా కాశీ విశ్వనాథ ఆలయానికి వెళ్లి శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీతో సహా మొత్తం 10 మంది మాజీ క్రికెటర్లు వారణాసికి చేరుకున్నారు. వారందరూ వంతులవారీగా శివునికి జలాభిషేకం చేసి పూజించారు. వారందరిలో సచిన్ టెండూల్కర్ ప్రజల ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. అతను ఎరుపు రంగు కుర్తాలో కూడా చాలా అందంగా కనిపించాడు. కాశీ విశ్వనాథ్ ఆలయంలో పూజలు చేసిన తర్వాత, సచిన్ టెండూల్కర్ వేదికపై ప్రధాని మోడీకి భారత జట్టు జెర్సీని బహుకరించారు.
450 కోట్ల వ్యయం
పూజలు చేసిన వారిలో క్రికెట్ దిగ్గజాలతో పాటు బీసీసీఐ సెక్రటరీ జై షా, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా కూడా ఉన్నారు. వారందరూ శివుడిని పూజించారు. వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం రూ.450 కోట్లతో నిర్మిస్తుండగా, ఇందులో రూ.330 కోట్లు బీసీసీఐ ఇవ్వాల్సి ఉండగా, రూ.120 కోట్లు యూపీ ప్రభుత్వం ఇవ్వనుంది. ఈ స్టేడియం ప్రత్యేకత ఏంటంటే.. శివుడి థీమ్పై డిజైన్ ఉంటుంది.