»Bank Holidays 15 Days In October 2023 Reasons Are Here
Bank holidays October2023: 15 రోజులు బ్యాంకులు బంద్..కారణమిదే
వచ్చే నెలలో మీకు ఏదైనా బ్యాంకు పని ఉంటే ముందే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే అక్టోబర్ నెలలో బ్యాంకులకు సుమారు 15 రోజులు సెలవులున్నాయి. అయితే దాదాపు నెలలో సగం రోజులు మాత్రమే బ్యాంకు సర్వీసులు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో అసలు అన్ని రోజులు బ్యాంకులకు సెలవులు ఎందుకనేది ఇప్పుడు చుద్దాం.
Banks closed for 15 days in October 2023 reasons are here
సెప్టెంబర్ మాసం పూర్తి కాబోతుంది. ఈ నేపథ్యంలో వచ్చె నెల అక్టోబర్లో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయి. ఎన్ని రోజులు పనిచేయనున్నాయనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ క్రమంలో మీకు ఏదైనా ముఖ్యమైన బ్యాంకు పని ఉంటే ఈ సెలవులను చూసుకుని మీ పనులను ప్లాన్ చేసుకోండి. లేదంటే మీరు తెలియకుండా సెలవుల రోజు బ్యాంకుకు వెళ్తే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ నెలలో అనేక పండుగల కారణంగా బ్యాంకులకు ఎక్కువ సెలవులు వచ్చాయి. ఇటువంటి పరిస్థితుల్లో మీరు బ్యాంకుకు సంబంధించిన ఏదైనా ముఖ్యమైన పని ఉంటే వీలైనంత త్వరగా పూర్తి చేసుకోండి.
ఇక భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) సూచనల ప్రకారం, ఆయా రాష్ట్రాన్ని బట్టి కొన్ని ప్రభుత్వ సెలవులు, కొన్ని ప్రాంతీయ సెలవు రోజుల్లో బ్యాంకులు మూసివేయబడతాయి. ఈ క్రమంలో వచ్చే నెలలో మొత్తం 15 రోజులకు పైగా సెలవులు ఉన్నాయని తెలుస్తోంది. ఇందులో శని, ఆదివారం సెలవులు కూడా ఉన్నాయి. వాస్తవానికి, అక్టోబర్ నెలలో ఐదు ఆదివారాలు వచ్చాయి. దీంతోపాటు రెండో, నాల్గో శనివారం కూడా బ్యాంకులకు సెలవు ఉంది.
అక్టోబర్ నెలలో బ్యాంకులకు సెలవులు
అక్టోబర్ 02 – గాంధీ జయంతి – జాతీయ సెలవుదినం
అక్టోబర్ 12 – నరక చతుర్దశి (అనేక రాష్ట్రాల్లో జరుపుకుంటారు)
అక్టోబర్ 14 – మహాలయ (ప్రధానంగా కర్ణాటక, ఒడిశా, త్రిపుర, పశ్చిమ బెంగాల్), రెండో శనివారం
అక్టోబర్ 15 – మహారాజా అగ్రసేన్ జయంతి- పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్
అక్టోబర్ 18 – కటి బిహు (అస్సాం)
అక్టోబర్ 19 – సంవత్సరాది పండుగ (గుజరాత్)
అక్టోబర్ 21 – మహా సప్తమి – ఒడిశా, పశ్చిమ బెంగాల్, త్రిపుర, సిక్కింలో
అక్టోబర్ 22 – మహా అష్టమి- భారతదేశంలోని అనేక రాష్ట్రాలు
అక్టోబర్ 23 – మహా నవమి – పశ్చిమ బెంగాల్, సిక్కిం, జార్ఖండ్, ఒడిశా, మణిపూర్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, త్రిపుర
అక్టోబర్ 24 – దసరా -మణిపూర్, పుదుచ్చేరి మినహా జాతీయం
అక్టోబర్ 28 – నాల్గవ శనివారం, లక్ష్మీ పూజ, పర్గత్ దివస్
అక్టోబర్ 28 – మహర్షి వాల్మీకి జయంతి అనేక రాష్ట్రాలలో జరుపుకుంటారు
అక్టోబర్ 31 – సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి (గుజరాత్)