Hyundai I20: హ్యుందాయ్ (Hyundai) కంపెనీ మరో కొత్త కారును లాంచ్ చేసింది. ఐ 20 ఎన్ లైన్ ఫేస్ లిప్ట్ను శుక్రవారం ఆవిష్కరించింది. ఐ 20 ఎన్ లైన్ టర్బో పెట్రోల్ ఇంజిన్ వేరియంట్లో అందుబాటులో ఉంది. కారుపై మూడేళ్లు లేదంటే లక్షన్నర కిలోమీటర్ల ఎక్స్టెండెట్ వారెంటీ ఇస్తున్నారు. ఇదివరకు ఐ 20 మోడల్లో టర్బో ఇంజిన్ వేరియంట్ తొలగించిన సంగతి తెలిసిందే. ఈ కారు రూ.9.99 లక్షల నుంచి రూ.12.32 లక్షల రేంజ్లో అందుబాటులో ఉంది.
ఐ20 ఎన్ లైన్లో 7 స్పీడ్ డీసీటీ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్, 6 స్పీడ్ మాన్యువల్ గేర్ ట్రాన్స్ మిషన్‌తో 1.0 లీటర్ కప్పా టర్బో జీడీఐ పెట్రోల్ ఇంజిన్ అమర్చారు. ఇదీ 118 బీహెచ్పీ పవర్ 172 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తోంది. నార్మల్, స్పోర్ట్స్, ఈకో అనే మూడ డ్రైవ్ మోడ్స్ ఉన్నాయి. ఐ 20 ఎన్ లైన్ ఫేస్ లిప్ట్‌లో డిజైన్, ఫీచర్ల పరంగా కీలక మార్పులు చేశామని, కారులోపలి భాగాలను యువతను దృష్టిలో ఉంచుకొని డిజైన్ చేశామని తెలిపారు. యువతను తప్పకుండా ఆకర్షిస్తోందని హ్యుందాయ్ మోటార్స్ ఇండియా సీవోవో తరుణ్ గార్గ్ వివరించారు.
ప్యాసెంజర్స్ సేప్టీ కోసం 6 ఎయిర్ బ్యాగులు సహా ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ అసిస్ట్ కంట్రోల్, వెహికిల్ స్టెబిలిటీ మేనేజ్ మెంట్, యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్ ఫీచర్లు ఉన్నాయి. ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ అప్ గ్రేడ్ చేశారు. 60 కనెక్ట్ ఫీచర్లు, ఓవర్ ది ఎయిర్ అప్ డేట్స్, మల్టీ లాంగ్వేజ్ సపోర్ట్, 127 బిల్ట్ ఇన్ వాయిస్ రికగ్నిషన్ కమాండ్స్, టైప్ సీ ఛార్జర్, ఏడు స్పీకర్లతో బాస్ సౌండ్ సిస్టమ్ సదుపాయాలు ఇచ్చారు.