సీనియర్ నటి జయసుధ మళ్లీ పెళ్లి చేసుకోబోతుందని సోషల్ మీడియాలో వార్తలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ANR విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమంలో ఆమె ఓ వ్యక్తితో కలిసి ఉండటం చూసిన పలువురు మూడో పెళ్లికి రెడీ అయ్యిందని అంటున్నారు.
ప్రముఖ సీనియర్ కథానాయిక జయసుధ(Jayasudha) ఇప్పటికే తల్లి పాత్రలో పాపులర్ పాత్రలతో తన నటనా జీవితాన్ని కొనసాగిస్తోంది. ఆమె సహజమైన నటనకు ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. అందుకే ఆమెను అందరూ సహజ నటి అని పిలుస్తూ ఉంటారు. . ప్రైమ్ టైమ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఆమె కూడా ఒకరు. ఇప్పటికీ మంచి రోల్స్ అందిపుచ్చుకుంటున్నారు. ఇక ఆమె వ్యక్తిగత జీవితానికి వస్తే జయసుధకి ఇప్పటికి రెండు పెళ్లిళ్లు అయ్యాయి. 1982లో వ్యాపారవేత్త అయిన కాకర్లపూడి రాజేంద్ర ప్రసాద్‌తో ఆమె మొదటి వివాహం జరిగింది. కానీ విభేదాల కారణంగా వారు చట్టపరంగా విడాకులు తీసుకుని త్వరగా విడిపోయారు.
ఆ తర్వాత ఆమె బాలీవుడ్ హీరో జితేంద్ర కపూర్ కజిన్ నితిన్ కపూర్‌తో ప్రేమలో పడింది. వీరిద్దరూ 1985లో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. వారిలో ఒకరు హీరోగా కూడా పరిచయం అయ్యారు. కానీ, పెళ్లయిన 32 ఏళ్ల తర్వాత 2017లో నితిన్ కపూర్ డిప్రెషన్‌తో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ షాక్ నుంచి బయటపడేందుకు జయసుధ చాలా సమయం తీసుకున్నారు.
కాగా తాజాగా ఆమె విదేశీయుడితో మూడో పెళ్లికి(marriage) సిద్ధమవుతోందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అతని గురించి పెద్దగా వివరాలు తెలియరాలేదు. కానీ ఆలీ కూతురు పెళ్లికి, విజయ్ వారసుడు ఈవెంట్‌కి ఇద్దరూ కలిసి హాజరయ్యారు. ఇదే విషయం గురించి అడిగినప్పుడు, జయసుధ తమ మధ్య ఎలాంటి సంబంధం లేదని కొట్టిపారేశారు. అయితే అతను తనపై బయోపిక్ తీయాలనుకుంటున్నారని తద్వారా సినిమా కార్యక్రమాలకు తనతో పాటు వస్తున్నానని చెప్పారు. కానీ ANR విగ్రహం ప్రారంభోత్సవంలోను ఇద్దరూ కలిసి మళ్లీ కనిపించారు. వారు చాలా సన్నిహితంగా ఉన్నారు. దీంతో మరోసారి జయసుధ మూడో పెళ్లి గురించి వార్తలు వచ్చాయి. కాకపోతే ఈ విషయంలో నిజం ఏంటో తెలియాలంటే, కొంతకాలం ఆగాల్సిందే.