»Modi Govt Approves Welfare Measures For Lic Agents Will Get Family Pension Gratuity Limit
LIC ఏజెంట్లకు గుడ్ న్యూస్.. ఇకపై మెరుగైన గ్రాట్యుటీ, పెన్షన్ కూడా
ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య వల్ల ఎల్ఐసీకి చెందిన 13 లక్షల మంది ఏజెంట్లకు ప్రయోజనం చేకూరనుంది. ప్రభుత్వ ఈ నిర్ణయంతో ఎల్ఐసికి చెందిన 10 లక్షల మంది రెగ్యులర్ ఉద్యోగులు కూడా ప్రయోజనం పొందనున్నారు.
LIC : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసి) ఏజెంట్లకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం సోమవారం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పుడు LIC ఏజెంట్లు, ఉద్యోగులు పెరిగిన గ్రాట్యుటీ పరిమితి ప్రయోజనం పొందుతారు. అంతేకాకుండా కుటుంబానికి టర్మ్ ఇన్సూరెన్స్ కవర్, పెన్షన్‌కు కూడా యూనిఫాం రేటు నిర్ణయించబడింది. ఎల్ఐసీ ఏజెంట్లు, ఉద్యోగుల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ఆమోదించింది. ఎల్ఐసి ఏజెంట్ల గ్రాట్యుటీ, పెన్షన్, టర్మ్ ఇన్సూరెన్స్ కవర్‌కు సంబంధించిన నిబంధనలలో మార్పులతో పాటు, రెన్యువబుల్ కమీషన్ కోసం ప్రభుత్వం అర్హత ప్రమాణాలను కూడా మెరుగుపరిచింది. ఇందుకోసం ఎల్ఐసీ (ఏజెంట్) నిబంధనలు-2017ను ప్రభుత్వం సవరించింది.
13 లక్షల మంది ఏజెంట్లకు లబ్ధి
ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య వల్ల ఎల్ఐసీకి చెందిన 13 లక్షల మంది ఏజెంట్లకు ప్రయోజనం చేకూరనుంది. ప్రభుత్వ ఈ నిర్ణయంతో ఎల్ఐసికి చెందిన 10 లక్షల మంది రెగ్యులర్ ఉద్యోగులు కూడా ప్రయోజనం పొందనున్నారు. దేశంలోనే అతిపెద్ద బీమా కంపెనీగా ఎల్ఐసీని తీర్చిదిద్దేందుకు ఈ ఏజెంట్లు, ఉద్యోగుల కృషి అవసరం. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటన విడుదల చేసింది.
ఎంత గ్రాట్యుటీ లభిస్తుంది
ఇప్పుడు ఎల్ఐసీ ఏజెంట్లకు గ్రాట్యుటీ పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచారు. ఎల్ఐసిలో తిరిగి నియమించబడే ఏజెంట్లు రెన్యువబుల్ కమీషన్ ప్రయోజనం పొందుతారు. ఇది అటువంటి ఏజెంట్ల ఆర్థిక స్థిరత్వాన్ని మెరుగుపరుస్తుంది. ఇప్పుడు ఎల్ఐసీ ఉద్యోగులు, ఏజెంట్ల టర్మ్ ఇన్సూరెన్స్‌ను రూ.3,000-10,000 నుంచి రూ.25,000-1.50 లక్షలకు పెంచారు. ఇప్పుడు కుటుంబ పింఛను అందరికీ 30 శాతం చొప్పున అందజేస్తామన్నారు.